పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుండి తమకు రూ.15 కోట్లు ఇప్పించాలని పేర్కొంటూ బిసిసిఐ (భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్) ఐసిసికి లేఖ రాసింది. భారత్, పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరక్కుండా అడ్డుకోవడం వల్ల తమకు భారీ నష్టం జరిగిందంటూ పిసిబి, బిసిసిఐపై కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోకి తమను అనవసరంగా లాగినందుకు పిసిబి నుండి న్యాయ ఖర్చుల కింద రూ.15 కోట్లు ఇప్పించాలని బిసిసిఐ ఐసిసిన కోరింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నారు. ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. దీంతో భారత్,పాకిస్థాన్ ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లన్ని రద్దయ్యాయి.
బిసిసిఐ నిర్ణయంతో తాము భారీగా నష్టపోవాల్సి వచ్చిందని పిసిబి ఆరోపిస్తూ ఐసిసి న్యాయస్థానంలో కేసు వేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు బీసీసీఐ రూ. 447 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ పిసిబి డిమాండ్ చేసింది. అయితే చాలా రోజుల పాటు ఈ కేసులో ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న కోర్టు భారత్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇందులో బిసిసిఐ తప్పేమి లేదన్న కోర్టు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ తీర్పునిచ్చింది.
అయితే తాజా ఈ కేసులోకి తమను లాగిన పిసిబి నుండి న్యాయ ఖర్చులు ఇప్పించాలని బిసిసిఐ, ఐసీసీ వివాద పరిష్కార కమిటీకి లేఖ రాసింది. నిబంధనల ప్రకారం పిసిబిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బిసిసిఐ కోరింది.