Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచకప్ లో భారత్-పాక్ మ్యాచ్ పై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడికి పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తముందని తేలడంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దిగజారాయి.దీంతో ఇరు దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావం ఇరుదేశాల క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. ఇప్పటికే భారత్ ప్రపంచ కప్ పాక్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇన్నిరోజులు మౌనంగా వున్న బిసిసిఐ తాజాగా  భారత్-పాక్ మ్యాచ్ పై ఓ క్లారిటీ ఇచ్చింది.

bcci clarify on bharat-pak match on world cup 2019
Author
Mumbai, First Published Feb 20, 2019, 2:44 PM IST

పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడికి పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తముందని తేలడంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దిగజారాయి.దీంతో ఇరు దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావం ఇరుదేశాల క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. ఇప్పటికే భారత్ ప్రపంచ కప్ పాక్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇన్నిరోజులు మౌనంగా వున్న బిసిసిఐ తాజాగా  భారత్-పాక్ మ్యాచ్ పై ఓ క్లారిటీ ఇచ్చింది.

వరల్డ్ కప్ ఆరంభానికి ఇంకా చాలా సమయం వుందని బిసిసిఐ పేర్కొంది. అప్పటివరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు సద్దుమణిగితే భారత్-పాక్ మ్యాచ్ కు ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే ఈ సమయంలో కూడా ప్రభుత్వం అంగీకరిస్తేనే ఈ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ పరిస్ధితులు ఎలా వున్నా ప్రభుత్వం ఈ మ్యాచ్ ను బహిష్కరించాలని ఆదేశిస్తే ప్రపంచ కప్ లోనే కాదు...ఎలాంటి టోర్నీలోనూ పాక్ తో భారత జట్టు ఆడే ప్రసక్తే లేదని బిసిసిఐ తేల్చింది. 

బిసిసిఐ పాక్ తో ఆడాలో లేదో నిర్ణయించే అధికారం కేవలం భారత ప్రభుత్వానిదేనని బిసిసిఐ పేర్కొంది. ఈ విషయంలో ఐసిసి నిర్ణయాలను కానీ... ఒత్తిడిని కానీ తాము పట్టించుకోబోమని బిసిసిఐ అధికారులు తెలిపారు.  

పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడిపై ఐసీసీ కూడా స్పందించింది. ఈ దాడిలో అమరులైన సైనికులకు ఐసిసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఐసిసి సీఈవో డెవ్ నిచర్డ్‌సన్ మాట్లాడుతూ...ప్రపంచ కప్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులుండవని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఖరారయిన మ్యాచులను ఆడాలో వద్దో ఆయా దేశాల క్రికెట్ బోర్డులే నిర్ణయిస్తాయని ఆయన వెల్లడించారు.     
 
Follow Us:
Download App:
  • android
  • ios