ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా ఒక ఓవర్లో ఆరు బంతులుండగా అంపైర్ తప్పిదం వల్ల బౌలర్ ఏడో బంతిని కూడా వేశాడు. సరిగ్గా అదే బాల్ కు బ్యాట్ మెన్ ఔటవడంతో అంపైర్ వివాదంలో చిక్కుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బిగ్ బాష్ లీగ్ లో ఇలాంటి తప్పిదాలు జరగడంపై కేవలం ఆసిస్ అభిమానుల నుండే కాదు క్రికెట్ అభిమానుల నుండి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆస్ట్రేలియా వేధికగా జరుగుతున్న డిగ్ బాష్ లీగ్ లో ఆదివారం పెర్త్‌ స్కార్చర్స్‌-సిడ్నీ సిక్సర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్‌ 177 పరుగులు చేసింది. దీంతో 178 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి పెర్త్‌ స్కార్చర్స్‌ బరిలోకి దిగింది. ఈ క్రమంలో డ్వార్‌షూయిస్‌ వేసిన రెండో ఓవర్లోనే ఓపెనర్ మైకేల్ క్లింగర్ ఔటయ్యాడు. 

ఓపెనర్ క్లింగర్ ఎంపైర్  తప్పిదానికి బలయ్యాడని తర్వాత తెలిసింది. రెండో ఓవర్లో చివరి బంతికి క్లింగర్ ఔటయ్యాడు. అయితే ఈ  మ్యాచ్ అంపైర్ తప్పిదం కారణంగా బౌలర్ తో ఏడో బంతి వేయించడం..అదే బంతికి కీలకమైన ఆటగాడు ఔటవడం జరిగింది. ఈ మ్యాచ్ లో పెర్త్‌ స్కార్చర్స్‌ గెలిచింది కాబట్టి ఈ విషయం అంతగా వివాదాస్పదం కాలేదు కానీ ఒకవేళ ఫలితంలో తేడా వచ్చింటే అంపైర్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చేది.