భారత్ తో జరగనున్న వన్డే సిరిస్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాతకాలపు జెర్సీతో బరిలోకి దిగనున్నారు. మొత్తం 3 వన్డెల్లోనూ ఆసిస్ ఆటగాళ్లు ఇదే జెర్సీలో కనిపించనున్నారు. దీంతో వన్డే సీరిస్ పైనే కాదు పాతకాలపు డ్రెస్లో ఆసిస్ ఆటగాళ్లు ఎలా వుండనున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మొదటి  వన్డే వరకు ఈ  ఉత్కంటను పెంచకుండా ఇవాళ ట్విట్టర్‌లో 1986 నాటి జెర్సీ ధరించివున్న ఆసిస్ ఆటగాళ్ళ వీడియోను పోస్ట్ చేసింది. 

ఆస్ట్రేలియా లెజండరీ మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్, భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గౌరవార్ధం వారి పేరుమీద ఈ సీరిస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రాధాన్యత కలిగివున్న సీరిస్‌లో బోర్డర్ కాలం నాటి జెర్సీని ధరించి ఆయన్ను గౌరవించడంతో పాటు ఆనాటి జట్టును గుర్తుచేసుకోవాలని ఆసిస్ బోర్డు భావించింది. అందుకోసమే గతకాలం నాటి జెర్సీతో ఆటగాళ్లను బరిలోకి దింపి ఈ సీరిస్‌పై మరింత ఆసక్తి పెంచింది. 

ఇప్పటికే చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయంతో జోరుమీదున్న టీంఇండియా వన్డే సీరిస్‌ను కూడా కైవసం చేసుకుని మరో చరిత్ర సృష్టించాలని చూస్తోంది. అయితే ఆసిస్ కూడా పాత కాలం జెర్పీతోనే కాదు...ఆనాటి అత్యత్తుమ ఆటతీరుతో భారత్ ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ఇలా రెండు జట్టు ఈ సీరిస్ విజయం గెలుపే లక్ష్యంగా పథకరచన చేస్తుండటంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో ఈ సీరిస్ పై ఆసక్తి మరింత పెరిగింది.