ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి రఫెల్ నాదల్... స్పెయిన్ బుల్‌ ముందు...

ఆస్ట్రేలియాన్ ఓపెన్ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌కి రఫెల్ నాదల్... కెరీర్‌లో రికార్డు స్థాయిలో 29వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడనున్న నాదల్...

Australian Open 2022: Rafael Nadal Reached final after beating Matteo Berrtettini

స్పెయిన్ ‘బుల్’ స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్ మత్తాయో బెర్రెటినీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 6-2, 3- 6, 3-6 తేడాతో విజయం సాధించిన రఫెల్ నాదల్... కెరీర్‌లో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కి అర్హత సాధించాడు..

2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్, ఆ తర్వాత నాలుగు సార్లు ఫైనల్ చేరినా టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. చివరిగా 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి చేరిన రఫెల్ నాదల్, తుదిపోరులో సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ చేతుల్లో ఓడిపోయాడు...

ఓవరాల్‌గా రఫెల్ నాదల్‌కి ఇది 29వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. ఫైనల్ మ్యాచ్‌లో నాదల్ టైటిల్ సాధిస్తే, రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్ స్టామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు... 

గ్రీకు టెన్నిస్ ప్లేయర్ స్టెఫనోజ్ సిట్సిపస్, రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెడ్వేదేవ్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్‌లో విజయం సాధించిన వారితో ఫైనల్‌లో తలబడబోతున్నాడు రఫెల్ నాదల్...

స్టెఫినోజ్ సిట్సిపస్‌తో ఇప్పటిదాకా 9 మ్యాచులు ఆడిన రఫెల్ నాదల్, ఏడింట్లో విజయాలు అందుకున్నాడు. రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెడ్వేదేవ్‌తో నాలుగు మ్యాచులు ఆడగా, మూడింట్లో నాదల్‌కి విజయం దక్కింది...

2020 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తర్వాత గాయాలతో సతమతమవుతున్న రఫెల్ నాదల్, రెండున్నరేళ్లుగా సరైన విజయాలు అందుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. 

కరోనా వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకోని కారణంగా నొవాకో జొకోవిచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎలాగైనా పాల్గొనాలని జొకోవిచ్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు...

జొకోవిచ్‌ని ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీలో పాల్గొనేందుకు ఫెడరల్ న్యాయస్థానం అనుమతించినా... ఆ దేశ విదేశాంగ మంత్రి ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. నొవాకో జొకోవిచ్ వీసాని రద్దు చేస్తూ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని ఫెడరల్ న్యాయస్థానం ఆమోదించడంతో నిరాశగా స్వదేశానికి పయనమయ్యాడు సెర్బియా స్టార్ క్రికెటర్... 

స్పానిష్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్‌తో పాటు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌లు కూడా 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో సమంగా ఉన్నారు. అయితే మట్టి కోర్టు మొనగాడిగా పేరొందిన రఫెల్ నాదల్. తన కెరీర్‌లో గెలిచిన 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌లో 13 ఫ్రెండ్ ఓపెన్ టైటిల్స్‌యే ఉండడం విశేషం... 

నొవాక్ జొకోవిచ్‌, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టోర్నీ మిస్ కావడంపై రఫెల్ నాదల్ స్పందించిన తీరు కూడా హాట్ టాపిక్ అయ్యింది. ‘ఏ ప్లేయర్ కోసం కూడా టోర్నీ ఆగదు. జొకోవిచ్ ఉన్నా, లేకపోయినా ఆస్ట్రేలియన్ ఓపెన్ సాగుతుంది. కరోనా కష్టకాలంలో రూల్స్ పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు రఫెల్ నాదల్... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios