ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేపడుతుండగా...వచ్చే నెలలో ఆసిస్ జట్టు భారత్ లో పర్యటించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఆస్ట్రేలియా జట్టు రెండు టీ20లు, ఐదు వన్డేలను ఆడేందుకు భారత్ కు రానుంది.  

ఐపిఎల్, వరల్డ్ కప్‌కు ముందు చివరగా ఆసిస్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యే ఆసిస్ పర్యటన మార్చి 13తో ముగియనుంది. వరల్డ్ కప్ కు ముందు జరిగే ఆ వన్డే సీరిస్ భారత్ తో పాటు ఆసిస్ జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది. అలాగే ఈ సీరిస్ తర్వాత ఇండియాలోనే జరగనున్న ఐపిఎల్‌కు సన్నద్దమవడానికి ఆసిస్ ఆటగాళ్లకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.   

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20తో పాటు వన్డే మ్యాచ్‌లను నిర్వహించడానికి ఇరు తెలుగు రాష్ట్రాలకు అవకాశం లభించింది. మొదట ఫిబ్రవరి 27న జరగనున్న రెండో టీ20కి ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా...మార్చి 2న జరగనున్న మొదటి వన్డేకు తెలంగాణలోని హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.    

భారత్‌-ఆస్ట్రేలియా టీ20 సీరిస్ షెడ్యూల్:

ఫిబ్రవరి 24వ తేదిన మొదటి టీ20 - బెంగళూరు
ఫిబ్రవరి 27వ తేదిన రెండో టీ20 - విశాఖపట్టణం

భారత్‌-ఆస్ట్రేలియా వన్డే సీరిస్ షెడ్యూల్:

మార్చి 2వ తేది మొదటి వన్డే -హైదరాబాద్
మార్చి 5వ తేది రెండవ వన్డే-నాగ్‌పూర్
మార్చి 8వ తేది మూడవ వన్డే-రాంచీ
మార్చి 10వ తేది నాలుగో వన్డే-మొహాలీ
మార్చి 13వ తేది ఐదో వన్డే-ఢిల్లీ