భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా 12వ తేదీ(రేపటి) నుండి వన్డే సిరిస్ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే స్వదేశంలో జరిగిన టెస్ట్ సీరిస్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆసిస్ జట్టు వన్డే సిరీస్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అందుకోసం రేపు సిడ్నీలో జరగబోయే మొదటి వన్డే కోసం ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 

రేపు శనివారం జరిగే మొదటి వన్డేలో బరిలోకి దిగే తుది జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ వన్డే సీరిస్‌కు ఎంపికై పీటర్ సిడిల్ సంచలనం  సృష్టించగా...తాజాగా అతడు తుది జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు.   2010 లో ఆసిస్ జట్టు తరపున వన్డే మ్యాచ్‌ ఆడిన సిడిల్ మళ్లీ ఇలా 8 ఏళ్ళ విరామం త్వరాత కంగారు జట్టులో స్థానం సంపాదించాడు. ఇలా కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత జట్టులోకి వచ్చిన అతడు ఏ మేరకు రాణిస్తాడోనని ఆస్ట్రేలియా అభిమానులు ఉత్కంటగా ఎదురుచూస్తున్నారు. 

అలాగే సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా జట్టులో ఓపెనింగ్ జోడి మారనుంది. కెప్టెన్ ఆరోన్ పించ్ కు జోడిగా వికెట కీపర్ అలెక్స్ కెరీ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ప్రారంబించనున్నారు. టెస్ట్ సీరిస్ లో విఫ‌ల‌మైన ఉస్మాన్ ఖ‌వాజా, షాన్ మార్ష్‌లు కూడా తుది జ‌ట్టులో స్ధానం సంపాదించుకున్నారు.  

తొలి వన్డేలో బరిలోకి దిగే ఆస్ట్రేలియా జట్టు: 
అరోన్ పించ్ (కెప్టెన్), అలెక్స్‌ కేరీ, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ , మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, పీటర్ సిడిల్, నాథన్ లైయన్, రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెండార్ఫ్