బోర్డర్-గవాస్కర్ ట్రోపిలో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో మాటల  యుద్దం కొనసాగుతోంది. స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో ఓటమిపాలవడంతో ఆసీస్ ఆటగాళ్లలో అసహనం పెరిగింది. దీంతో భారత ఆటగాళ్లను ఆటతో కాకుండా మాటలతో ఎదుర్కోవాలని ఆసిస్ క్రెకెటర్స్ భావిస్తున్నట్లున్నారు. గ్రౌండ్ లో భారత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి మరోసారి తమ పాత పద్దతైన స్లెడ్జింగ్ ను ఎంచుకున్నారు. 

పెర్త్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్ల మధ్య మాటల యద్దం ముదురుతొంది. మూడో రోజు(ఆదివారం) వీరి మధ్య మొదలైన మాటల యుద్దం నాలుగో రోజు కొనసాగింది. ఇవాళ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో ఆసిస్ కెప్టెన్ టిమ్ పేన్ కవ్వింపుకు దిగాడు. దీంతో కోహ్లీ అతడిపైకి దూసుకుపోయాడు. ఇలా ఒకరిపైకి ఒకరు వెళుతుండగా కలుగజేసుకున్న అంపైర్లు ఇద్దరికి సర్దిచెప్పి పంపించారు. దీంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. ఈ గొడవ జరిగిన కొద్దిసేపటికే కోహ్లీ  ఔటయ్యాడు.

అయితే తర్వాత బ్యాటింగ్ కొనసాగిస్తున్న మురళీ విజయ్ ని రెచ్చగొడుతూ కోహ్లీని ఉద్దేశిస్తూ ఫేన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.  కోహ్లీ అంటే మీకు నచ్చదు కదా మురళీ అంటూ స్లెడ్జింగ్ కు దిగాడు. ఆతడు(కోహ్లీ) అంత కఠిరంగా వ్యవహరించడం మీకు ఎలా నచ్చుతుందంటూ విజయ్ ని ప్రశ్నించాడు. ఇలా మురళీ విజయ్ ని రెచ్చగొడుతూ ఫేన్ చేసిన వ్యాఖ్యలు మైక్రోఫోన్‌లో వినిపించాయి. దీంతో మరోసారి ఈ కోహ్లీ, ఫేన్ ల మధ్య వివాదం బయటపడింది. 

మూడో రోజు ఆటలో కూడా కోహ్లీ ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌ దగ్గరకు వెళ్లాడు.. ‘‘మీరు ఇలా ఆడితే సిరీస్ 2-0గా మారుతుందని’’ హెచ్చరించాడు. దీనికి ‘‘ మీరు ముందు బ్యాటింగ్ చేయాల్సింది కదా బిగ్ హెడ్’’ పైన్ ధీటుగా బదులిచ్చాడు.  ఇవి గ్రౌండ్‌లోని స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మురళీ విజయ్ ని రెచ్చగొడుతూ ఫేన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల కోపానికి కారణమవుతున్నాయి.