ఏషియన్ గేమ్స్ 2023: స్వర్ణం గెలిచిన పారుల్ చౌదరి.. సెంచరీ టార్గెట్ దిశగా భారత అథ్లెట్లు..
Asian Games 2023: 5000 మీటర్ల మహిళల పరుగు పందెంలో స్వర్ణం గెలిచిన పారుల్ చౌదరి... డెకాథ్లాన్ పురుషుల ఈవెంట్‌లో భారత అథ్లెట్ తేజస్వీన్ శంకర్‌కి రజతం...
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.. 3000 మీటర్ల స్టీపెల్‌ఛేజ్ ఈవెంట్‌లో రజతం గెలిచిన పారుల్ చౌదరి, 5000 మీటర్ల మహిళల పరుగు పందెంలో స్వర్ణం గెలిచింది.
మిక్స్‌డ్ 4X400 రిలే పోటీల్లో రజతం గెలిచిన విథ్యా రామ్‌రాజ్, మహిళల 400 మీటర్ల హర్డెల్స్‌లో కాంస్యం గెలిచింది. 39 ఏళ్ల కిందట ఏషియన్ గేమ్స్‌లో పతకం గెలిచిన పరుగుల రాణి పీటీ ఉషా రికార్డును సమం చేసింది కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ విథ్యా రామ్‌రాజ్..
పురుషుల స్క్వాష్ సింగిల్స్‌లో భారత స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ గోషల్ సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. 57 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత బాక్సర్ సచిన్ సివాచ్ 1-4 తేడాతో ఓడిపోయాడు. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అనహాత్- అభయ్ జోడి, కొరియన్ జోడిపై 2-1 విజయం అందుకుని సెమీస్ చేరింది. అలాగే మరో భారత స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్ జోడి దీపికా పల్లికల్-హరీందర్ పాల్ సింగ్ కూడా సెమీస్ చేరుకున్నారు.
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు.
డెకాథ్లాన్ పురుషుల ఈవెంట్‌లో భారత అథ్లెట్ తేజస్వీన్ శంకర్, రజతం గెలిచాడు. 1974 తర్వాత పురుషుల డెకాథ్లాన్ ఈవెంట్‌లో భారత్‌కి దక్కిన పతకం ఇదే. పురుషుల 800 మీటర్ల పరుగు పందెంలో మహ్మద్ ఆఫ్సల్, రజతం గెలిచాడు. పురుషుల త్రిబుల్ జంప్ ఈవెంట్‌లో ప్రవీణ్ చిత్‌రావెల్‌కి కాంస్యం దక్కింది.