Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023 : ఆరంభమే అదుర్స్... భారత్ ఖాతాలో సిల్వర్స్, బ్రాంజ్ మెడల్స్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల వేట ప్రారంభించారు. తొలిరోజే షూటింగ్, రోయింగ్ విభాగాల్లో భారత్ ఖాతాలోకి పతకాలు చేరాయి. 

Asian games 2023 ...  India win Silver and bronze medals in Shooting and Rowing  AKP
Author
First Published Sep 24, 2023, 9:30 AM IST

చైనా : ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. చైనాలోని హాంగ్ జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ కేంద్రంగా ప్రారంభమైన ఈ క్రీడల్లో ఇవాళ ఆరంభంలోనే భారత్ పతకాల వేట ప్రారంభించింది. పాల్గొన్న మొదటి ఈవెంట్ లోనే పతకాన్ని సాధించి శుభారంభం అందించారు భారత షూటర్లు. 10మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత, మెహులి ఘోష్, అశి చౌక్సే అద్భుత ప్రదర్శనతో సిల్వర్ మెడల్ అందుకున్నారు. గ్రూప్ విభాగంలో మెడల్ సాధించడంతో పాటు రమిత, మెహులి వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్ కు చేరారు. 

ఇక భారత ఆర్మీకి చెందిన అర్జున్  లాల్ జాట్ మరియు అరవింద్ కలిసి పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్ విభాగంలో మరో సిల్వర్ సాధించారు. ఇక రోయింగ్ విభాగంలోనే బాబులాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం, ఎనిమిది మందితో కూడిన టీమ్ మరో సిల్వర్ కూడా భారత్ సాధించింది. 

Read More  ఏషియన్ గేమ్స్ 2023: క్వార్టర్ ఫైనల్‌లోకి భారత వాలీబాల్ టీమ్... చైనీస్ తైపాయ్‌పై సంచలన విజయం..

ఇలా ఇప్పటికే భారత్ ఖాతాలో పతకాలు చేరగా మరికొన్నింటి వేటలో ఆటగాళ్లు దూసుకుపోతున్నారు.భారత మహిళా క్రికెట్ జట్టు సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరింది. మరికొన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు తలపడాల్సి వుంది. ముఖ్యంగా రోయింగ్ లో మరిన్ని పతకలు భారత్ కు దక్కే అవకాశాలున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios