ఏషియన్ గేమ్స్ 2023: స్వర్ణ భారతం... గోల్డ్ మెడల్ సాధించిన భారత పురుషుల హాకీ టీమ్..

Asian Games 2023: డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌ని చిత్తు చేసి 5-1 తేడాతో చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న భారత హాకీ టీమ్.. 

Asian Games 2023: India win GOLD medal in Men's Hockey after BEATING defending Champion Japan CRA

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత్ 100 పతకాలను ఖాయం చేసుకుంది. తాజాగా పురుషుల హాకీ జట్టు, ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌ని చిత్తు చేసి 5-1 తేడాతో స్వర్ణం కైవసం చేసుకుంది. మొదటి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ సాధించలేకపోయాయి. రెండో క్వార్టర్‌లో మన్‌ప్రీత్ గోల్ చేయడంతో హాఫ్ టైమ్ ముగిసే సమయానికి 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది భారత జట్టు.

మూడో క్వార్టర్ మొదలవుతూనే హర్మన్‌ గోల్ చేసి 2-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత అమిత్ రోహిదాస్ కూడా గోల్ చేయడంతో 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది భారత జట్టు. నాలుగో క్వార్టర్‌లో అభిషేక్ గోల్ చేశాడు. ఆ తర్వాత జపాన్ ఓ గోల్ సాధించి, భారత ఆధిక్యాన్ని 4-1 తేడాకి తగ్గించగలిగింది. ఆఖరి సెకన్లలో హర్మన్ ఇంకో గోల్ చేయడంతో 5-1 తేడాతో మ్యాచ్‌ని, గోల్డ్ మెడల్‌ని కైవసం చేసుకుంది భారత హాకీ జట్టు..

ఈ విజయంతో గోల్డ్ మెడల్‌తో పాటు పారిస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌కి కూడా నేరుగా అర్హత సాధించింది భారత పురుషుల హాకీ జట్టు..  1966 బ్యాంకాక్‌ ఏషియన్ గేమ్స్, 1998, 2014 ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత హాకీ జట్టు, 9 ఏళ్ల తర్వాత మళ్లీ పసిడి పతకం కైవసం చేసుకుంది. 

రెజ్లింగ్‌లో ఒలింపిక్ మెడలిస్ట్ భజరంగ్ పూనియా, కాంస్య పతక పోరులో జపాన్ రెజ్లర్ కైకీ యమగూచీ చేతుల్లో 10-0 తేడాతో ఓడిపోయాడు. అయితే 57 కేజీల విభాగంలో రెజ్లర్ ఆమన్ సెహ్రావత్, తన ప్రత్యర్థి చైనా రెజ్లర్ లి మింగూని 11-0 తేడాతో ఓడించి కాంస్యం సాధించాడు.  

మహిళల 76 కేజీల విభాగంలో రెజ్లర్ కిరణ్ భిష్ణోయ్, మంగోలియా రెజ్లర్ గ్రాప్లర్‌ని 6-3 తేడాతో ఓడించి కాంస్యం గెలిచింది.  అలాగే 62 కేజీల విభాగంలో సోనమ్, చైనా రెజ్లర్, ఏషియన్ ఛాంపియన్ లాంగ్ జీపై 6-4 తేడాతో విజయం సాధించి కాంస్యం సాధించింది. 

మెన్స్ బ్రిడ్జ్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది. అలాగే ఆర్చరీలో ఫైనల్ చేరిన భారత పురుషుల రికర్వ్ టీమ్, సౌత్ కొరియా చేతుల్లో 1-5 తేడాతో ఓడి సిల్వర్ మెడల్ సాధించింది. 

ఇప్పటికే ఏషియన్ గేమ్స్‌లో 95 మెడల్స్ సాధించిన టీమిండియా, రేపు జరిగే పోటీల్లో 100 మెడల్స్‌ని దాటేయడం గ్యారెంటీ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios