Asianet News TeluguAsianet News Telugu

ఆసియా క్రీడలు 2023 : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం...

ఆసియా క్రీడలు 2023ల్లో భారత్ పతకాల పరుగులు పెడుతోంది. స్వర్ణాలతో దూసుకుపోతోంది. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం దక్కించుకుంది. 

Asian Games 2023 : India win gold in Men's 10m Air Pistol Team event in Shooting category - bsb
Author
First Published Sep 28, 2023, 8:50 AM IST

ఆసియా క్రీడలు 2023లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ 1734 పాయింట్ల మొత్తం స్కోరు సాధించి స్వర్ణం దక్కించుకుంది. భారత త్రయం సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి స్వర్ణం సాధించారు.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు. వారి అద్భుతమైన ఆటతీరుతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి టీం స్వర్ణం సాధించారు. 

వియత్నాం పటిష్ట ప్రదర్శన చేసి 1730 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 580 పాయింట్లు సాధించిన సరబ్జోత్ ఐదో ర్యాంక్ సాధించగా, అర్జున్ 578 పాయింట్లతో వ్యక్తిగత క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ నేడు జరగనున్న పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో పోటీ పడనున్నారు. దీంతో ప్రస్తుత ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 24వ పతకం, షూటింగ్‌లో నాలుగో బంగారు పతకం లభించింది.

Follow Us:
Download App:
  • android
  • ios