ఆసియాక్రీడలు 2023 : ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ కు తొలి స్వర్ణం...
ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించింది.

చైనా వేదికగా ఆసియన్ గేమ్స్-2023 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ గోల్డ్ మెడల్ లో బోణీ కొట్టింది. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా స్వర్ణం కైవసం చేసుకుంది. భారత్ కు మొట్టమొదటి బంగారు పతకాన్ని రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ లతో కూడిన జట్టు సాధించింది.
1893.7 స్కోర్ తో క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తరువాతి స్థానంలో 1890.1 స్కోరుతో ఇండోనేషియా నిలిచి, సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఇక పొరుగుదేశమైన చైనా కాంస్య పతకంతో మూడో స్థానంలో నిలిచింది.