Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. స్టెప్లెచేస్‌లో అవినాష్‌ సాబుల్‌కి గోల్డ్ మెడల్..

Asian Games 2023: 3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ అవినాష్ సాబుల్‌కి స్వర్ణం... గేమ్ బెస్ట్ పర్ఫామెన్స్‌తో పసిడి కైవసం..

 

Asian Games 2023: AVINASH SABLE wins GOLD medal in 3000m  STEEPLECHASE CRA
Author
First Published Oct 1, 2023, 5:11 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. భారత షూటర్లు ఏకంగా 22 మెడల్స్‌తో పతకాల పంట పండించగా తాజాగా 3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ స్వర్ణం సాధించాడు. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అవినాష్ సాబుల్, ఈసారి ఏకంగా పసిడి కైవసం చేసుకుని చరిత్ర క్రియేట్ చేశాడు.. 

 8:19.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న అవినాష్, సరికొత్త గేమ్ రికార్డుతో స్వర్ణం సాధించాడు. జపాన్‌ అథ్లెట్లు అవోకి రోమా, సునడా సీనాలకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. 10 వేల మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్లు కార్తీక్ కుమార్ రజతం సాధించగా, గుల్వీర్ సింగ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 

3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత పురుష అథ్లెట్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అవినాష్. ఇంతకుముందు 2010 ఏషియన్ గేమ్స్‌లో మహిళా అథ్లెట్ సుధా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది.  

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్య పతకం గెలిచింది. థాయిలాండ్‌కి చెందిన చుతమత్ రక్షత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడింది నిఖత్ జరీన్. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్‌పై భారత్ పసిడి ఆశలు పెట్టుకుంది. అయితే నిఖత్ జరీన్, ఫైనల్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది..

బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో చైనాతో తలబడుతున్న భారత్, రెండు రౌండ్లు ముగిసే సమయానికి 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. లక్ష్య సేన్, చైనా ప్లేయర్ యుకీ షీతో మ్యాచ్‌లో 22-20, 14-21, 21-18 తేడాతో విజయాన్ని అందుకుని, టీమిండియాకి 1-0 ఆధిక్యం అందించాడు..

రెండో మ్యాచ్‌లో భారత స్టార్ డబుల్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి, లియాంగ్ -వాంగ్‌తో మ్యాచ్‌ని 21-15, 21-18 వరుస సెట్లలో చేజిక్కించుకున్నారు. మిగిలిన మూడు మ్యాచుల్లో భారత్ ఒక్క మ్యాచ్ గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios