ఆసియా కప్ హాకీ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో జపాన్‌పై 2- 1 తేడాతో విజయం సాధించిన భారత పురుషుల హాకీ టీమ్... గ్రూప్ స్టేజీలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్...
ఆసియా కప్ హాకీ టోర్నీ 2022 టోర్నీలో భారత హాకీ జట్టు సూపర్ 4 స్టేజీలో తొలి విజయం అందుకుంది. ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ జపాన్‌ని 2-1 తేడాతో ఓడించిన టీమిండియా, సూపర్ 4లో ఆడిన మొదటి మ్యాచ్‌ని విజయంతో ఆరంభించింది...
గ్రూప్ స్టేజీలో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 2-5 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమికి సూపర్ 4 స్టేజీలో అదిరిపోయే రివెంజ్ తీర్చుకుంది టీమిండియా. ఆట ప్రారంభమైన 8వ నిమిషంలో గోల్ చేసిన మన్‌జీత్, భారత జట్టుకి 1-0 తేడాతో ఆధిక్యాన్ని అందించాడు...
అయితే తొలి సగంలోనే 18వ నిమిషంలో గోల్ సాధించి, స్కోర్లను 1-1 తేడాతో సమం చేసింది జపాన్. జపాన్ ఆటగాడు నివా గోల్ సాధించి, భారత జట్టు ఆధిక్యాన్ని తగ్గించాడు. అయితే రెండో సగం ప్రారంభమైన తర్వాత ఆట 40వ నిమిషంలో ఉత్తమ్ సింగ్, పవర్ రాజ్‌భార్ కలిసి గోల్ సాధించి... టీమిండియా స్కోరును 2-1 తేడాతో ఆధిక్యంలోకి తెచ్చారు...
మూడో క్వార్టర్‌లో గోల్ చేసేందుకు జపాన్ చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత హాకీ టీమ్, నాలుగో సగంలోనూ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అద్భుత విజయాన్ని అందుకుంది...
ఆసియా కప్ హాకీలో పూల్ Aలో ఉన్న భారత జట్టు, గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌ను 1-1 తేడాతో డ్రా చేసుకుంది. ఆ తర్వాత జపాన్ చేతుల్లో 2-5 తేడాతో ఓడిన భారత జట్టు, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
నాకౌట్ స్టేజీకి అర్హత సాధించాలంటే ఇండోనేషియాపై 15-0 తేడాతో భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఏకంగా 16-0 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పాకిస్తాన్‌ని వెనక్కినెట్టి సూపర్ 4 స్టేజీకి దూసుకొచ్చింది భారత హాకీ జట్టు...
పూల్ బీ నుంచి మలేషియా, దక్షిణ కొరియా జట్టు సూపర్ 4 లెవెల్‌కి అర్హత సాధించాయి. ఇండియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లలో టాప్ 2 ఉన్న జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయి.
సూపర్ 4లో భాగంగా భారత జట్టు మే 29న మలేషియాతో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత మే 31న దక్షిణ కొరియాతో తలబడుతుంది.
2017లో మూడోసారి ఆసియా కప్ హాకీ టైటిల్ గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ 2022 టోర్నీలో బరిలో దిగింది. అయితే దక్షిణ కొరియా పురుషుల హాకీ జట్టు నాలుగు సార్లు ఆసియా కప్ హాకీ టైటిల్ గెలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది...
