ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో మరోమారు క్రీజులో పాతుకుపోయి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సహచరులందరూ ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా స్మిత్ మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లిష్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్.. మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్ వరుసగా పదోసారి ఇంగ్లండ్‌పై 50కి పైగా పరుగులు సాధించాడు. ఓ దేశంపై వరుసగా ఇన్ని అర్ధ సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. 

గతంలో ఈ రికార్డు పాక్ ఆటగాడు ఇంజమాముల్ హక్ పేరుపై ఉండేది. 2001-2006 మధ్య హక్ ఇంగ్లండ్‌పై వరుసగా 9సార్లు 50కిపైగా పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును స్మిత్ బద్దలుగొట్టాడు. కాగా, స్మిత్ సెంచరీ ముంగిట అవుటయ్యాడు. 145 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 80 పరుగులు చేసిన స్మిత్.. వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.