అర్జెంటీనా ఓటమి.. తట్టుకోలేకపోయిన అభిమానులు

ఫిఫా వరల్డ్‌ కప్‌లో గెలిస్తే.. ఎంతగా ఆశాకానికెత్తేస్తారో.. ఓడిపోతే అంతకు మించి మాటలు పడాల్సి వస్తుంది.. ఎందుకంటే అభిమానులు ఆయా జట్ల మీద ఉంచుకునే అంచనాలు అలాంటివి మరి.. తాజాగా ప్రపంచకప్‌ను ముద్ధాడాలన్న అర్జెంటీనా ఆశలకు గండి పడింది.. టోర్నీలో భాగంగా గురువారం నిజ్నీ నొవొగొరొడ్‌లో గ్రూప్-డిలో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా చిత్తుగా ఓడిపోయింది. క్రొయేషియాకు ఏ దశలోనూ కనీసపోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ సేన 0-3తో ఓటమి పాలైంది.. ప్రధానంగా ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ ఆటగాడు, కెప్టెన్ లియోనల్ మెస్సీ‌ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఎంతో ఉత్సాహంగా తమ జట్టు ప్రదర్శన చూద్దామని వచ్చిన అర్జెంటీనా అభిమానులు మ్యాచ్ అనంతరం మెస్సీ సేనపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఆటను తాము ఎంత మాత్రం సహించబోమని.. ఇలా ఆడితే ఎన్నటికి ఛాంపియన్లం కాలేమని అన్నారు. ముఖ్యంగా కోచ్ శాంపోలి జట్టును సరిగా నడిపించలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. మెస్సీ కష్టపడినప్పటికీ మిగిలిన ఆటగాళ్లు అతనికి సహకరించలేదని మండిపడ్డారు.

"