ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి కాబోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటి హేజెల్ కీచ్ ను యూవీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారబోతున్నారు. ఈ మేరకు బాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పటి వరకు ఈ విషయంపై యూవీ కానీ హేజెల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. తాజాగా ఈ జంట అంబానీ ఇంట వివాహానికి హాజరైన సమయంలో.. ఈ విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. గతంలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా గర్భవతి అంటూ రూమర్స్ వచ్చాయి. వాటిని ఆమె ఖండించారు. 

ఇదిలా ఉండగా.. 2016 నవంబర్ 30వ తేదీన యూవీ, హేజెల్ సిక్కు సంప్రదాయ వివాహంతో ఒక్కటయ్యారు. తర్వాత డిసెంబర్ 2వ తేదీన గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు.