టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్క నటి  అనుష్క శర్మ గతేడాది పెళ్లి బంధంతో దంపతులుగా మారిన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయిన తర్వాత వీరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గతంలో ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో ఈ జంట మీడియాకు భయపడి తమకు సంబంధించిన విషయాలు, ఫోటోలు భయటకు రానిచ్చేవారు కాదు. దీంతో వారి మధ్య ప్రేమ ఏ స్థాయిలో వుందో ఎవరికీ తెలిసేది కాదు.

కానీ పెళ్లి తర్వాత మాత్రం వారి ప్రేమ గురించి, అన్యోన్యత గురించి తరచూ వార్తలు వినిపిస్తున్నారు. వీరిద్దరు తమ పనుల్లో బిజీగా వుంటూ కూడా ఒకరి కోసం సమయం కేటాయించుకుంటూ సరదాగా గడుపుతుంటారు. అలా అనుష్క తరచూ క్రికెట్ మ్యాచులకు హాజరవడం....కోహ్లీ ఆమెకు మైదానంలో నుండే గాల్లో ముద్దులిస్తూ ప్రేమను చాటుకోవడం చూశాం.  

ఇలా మిగతా సమయాల్లోనే ప్రేమలో మునిగితేలే ఈ జంట ప్రేమికుల రోజున ఊరికే వుంటారా. ప్రేమికులకు ప్రత్యేకమైన ఈ వాలంటైన్స్ డే రోజుకు ఒకరోజు ముందుగానే కోహ్లీ, అనుష్క జంట సంబరాల్లో మునిగిపోయారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఈ సెలబ్రిటీ కపుల్ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బుధవారం రాత్రి డిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ న్యూవాలో డిన్నర్ డేట్‌కు వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటోను విరాట్ తన ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నా వాలైంటైన్‌తో కలిసి డిన్నర్ డేట్ కు వెళ్లానంటూ ఓ కామెంట్ ను జతచేస్తూ కోహ్లీ ఫోటోను పోస్ట్ చేశాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

About last night with my valentine ❤️👫. #greatmeal #nueva #loveit @anushkasharma @nueva.world

A post shared by Virat Kohli (@virat.kohli) on Feb 14, 2019 at 1:02am PST