‌మన ధాటికి వాళ్లు నిలబడలేరు: కుంబ్లే

anil kumble comments on india vs England series
Highlights

మన ధాటికి వాళ్లు నిలబడలేరు: కుంబ్లే

త్వరలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సిరీస్‌లో విజయం భారత్‌దేనని జోస్యం చెప్పారు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.. అన్ని విభాగాల్లో అత్యంత అనుభవమున్న టీమిండియాను ఎదుర్కోవడం అంత సులభంకాదని.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగా ఉందన్నారు..

20 వికెట్లు తీసే బౌలర్లు, 50 టెస్టులు ఆడిన ఆటగాళ్లు.. ఇంగ్లాండ్ గడ్డ మీద ఆడిన అనుభవమున్న వారు మన జట్టులో ఉన్నారన్నారు.. వచ్చే నెల 3వ తేది నుంచి ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య సిరీస్ ఆరంభంకానుంది. ఇంగ్లాండ్‌తో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడనుంది.


 

loader