భారత్ వద్దు.. పాక్ ముద్దు.. కేకేఆర్ ఆటగాడి సంచలన నిర్ణయం
KKR: సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ IPL 2026 మినీ ఆక్షన్ కు దూరమైన సంగతి తెలిసిందే. IPL బదులు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడాలనే తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు.

ఐపీఎల్ వద్దు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ముద్దు..
సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ IPL 2026 మినీ ఆక్షన్ కు దూరమైన సంగతి తెలిసిందే. IPL బదులు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడాలనే తన కోరికను వ్యక్తపరిచాడు. డుప్లెసిస్ ఇప్పటికే IPL కాకుండా PSL ఆడాలని చెప్పిన తర్వాత మొయిన్ అలీ కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ వేలానికి దూరం..
ఇంగ్లాండ్ జట్టుకు దూరమైన మొయిన్ అలీ, గత సీజన్ IPLలో పెద్దగా రాణించలేకపోయాడు. తుది జట్టులో తక్కువ అవకాశాలు రావడంతో IPL వద్దనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో పోస్ట్
మొయిన్ అలీ తన సోషల్ మీడియాలో, "న్యూ ఎరాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ లో చేరడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఈ లీగ్ T20 క్రికెట్ ఖ్యాతిని సంపాదించుకుంది. ప్రతి జట్టులో మంచి ప్లేయర్స్, ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్థాన్‌లో ఆడడం ఎల్లప్పుడూ అద్భుతమైంది. అక్కడ క్రికెట్ నాణ్యత అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకుల ఎంకరేజ్మెంట్ తో అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. నేను దానిలో భాగం కావాలని, ఈ ప్రయాణంలో కొన్ని గొప్ప జ్ఞాపకాలను సృష్టించాలని ఎదురుచూస్తున్నాను" అని రాసుకొచ్చాడు.
కేకేఆర్ ఆటగాడు గణాంకాలు
మొయిన్ అలీ 2018 నుండి IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. IPL కెరీర్ లో 73 మ్యాచ్లు ఆడి, బ్యాటింగ్‌లో 1167 పరుగులు, బౌలింగ్‌లో 41 వికెట్లు పడగొట్టాడు.
PSL ముద్దు.. ఐపీఎల్ వద్దు
గత సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది. 2026 మినీ ఆక్షన్ లో అన్ సోల్డ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని గ్రహించిన మొయిన్, ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున 9 మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతనికి ఉంది.

