మరోసారి హార్ధిక్ పాండ్యాపై ట్రోల్స్.. కెరీర్ మార్చుకోమని సలహాలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 14, Sep 2018, 3:42 PM IST
Angry Fans Suggest Career Options For Hardik Pandya After Instagram Post
Highlights

పాండ్యా క్రికెట్ వదిలేసి వేరే కెరిర్ ఎంచుకోవాలని వెటకారంగా సలహాలు ఇస్తున్నారు. 

టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌పై టీమిండియా టెస్టు సిరీస్‌ ఓడిపోవడానికి గల కారణాల్లో పాండ్యా ప్రధాన కారణమంటూ అతడిని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పాండ్యా షేర్ చేస్తున్న తన ఫోటోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. పాండ్యా క్రికెట్ వదిలేసి వేరే కెరిర్ ఎంచుకోవాలని వెటకారంగా సలహాలు ఇస్తున్నారు. 

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు అనంతరం లండన్‌ వీధుల్లో విహరిస్తూ దిగిన ఫోటో షేర్‌ చేయగా దానిపై నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌పై కూడా అభిమానులు చురకలు అంటిస్తున్నారు.

‘ఇంగ్లండ్‌ పర్యటనలో చాలా పోరాడాం. ఈ సిరీస్‌ చాలా ఉపయోగపడింది. చాలా రోజుల తర్వాత ఇంటికి రావడం సంతోషంగా ఉంది. కానీ తక్కువ సమయంలోనే ఆసియా కప్‌ కోసం బయల్దేరాలి’అంటూ తన న్యూ లుక్‌తో దిగిన ఫోటో పోస్ట్‌ చేశాడు. దీనిపై ఆగ్రహించిన అభిమానులు ‘నువ్వు క్రికెట్‌ ఆడటానికి పనికిరావు, ర్యాపర్‌గా సెట్‌ అవుతావు.. ఆ ప్రయ​త్నం మొదలు పెట్టు’ అంటూ సలహాలు ఇచ్చారు. ‘పాండ్యా నువ్వు ఓ గ్యాంగ్‌ స్టర్‌లా ఉన్నావు ’ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. పాండ్యాకు స్టైల్‌ మీద ఉన్న ప్యాషన్‌ క్రికెట్‌పై లేదని మరికొంత మంది ఎద్దేవా చేశారు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో పాండ్యా అట్టర్‌ఫ్లాఫ్‌ కావడంతోనే కోహ్లి సేన ఓడిపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

loader