పాక్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది ని సైకియాట్రిస్ట్ కి చూపిస్తానని ఇండియన్ క్రికెటర్ గంభీర్  అన్నారు. అఫ్రీది.. తాను రాసుకుంటున్న ఆత్మకథ ‘గేమ్‌ ఛేంజర్‌’లో తన వయసు గురించి నిజాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. 

పాక్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది ని సైకియాట్రిస్ట్ కి చూపిస్తానని ఇండియన్ క్రికెటర్ గంభీర్ అన్నారు. అఫ్రీది.. తాను రాసుకుంటున్న ఆత్మకథ ‘గేమ్‌ ఛేంజర్‌’లో తన వయసు గురించి నిజాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా గంభీర్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. తనకు, గంభీర్‌కు మధ్య జరిగిన గొడవలు, గంభీర్‌ వ్యక్తిత్వం గురించి ప్రస్తావించాడు.

గంభీర్ కి వ్యక్తిత్వమే లేదని... క్రికెట్ అనే పెద్ద ప్రపంచంలో అతను ఒక పాత్ర అని పేర్కొన్నారు. ‘‘గంభీర్‌ మాత్రం డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌బాండ్‌ లక్షణాలు కలిపి తనలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. చెప్పుకోదగ్గ ఒక్క రికార్డు కూడా గంభీర్‌కు లేదు. కేవలం అతని ప్రవర్తనతోనే అందరి నోళ్లలో నానుతుంటాడు’ అని అఫ్రిది నోరుపారేసుకున్నాడు.

తనపై అఫ్రీది చేసిన ఆరోపణలకు గంభీర్ ఘాటుగా స్పందించాడు. అఫ్రిదిని సైకియాట్రిస్ట్ ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశాడు. నువ్వో వింత మ‌నిషివి, మేం మెడిక‌ల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీల‌కు వీసాలు జారీ చేస్తున్నాం, వ్య‌క్తిగ‌తంగా నేనే నిన్ను మాన‌సిక వైద్యుడికి ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ గంభీర్ ఇవాళ‌ త‌న ట్వీట్‌ను అఫ్రిదీకి ట్యాగ్ చేశాడు.