Karthika Masam: కార్తీక మాసాన్ని శివయ్యకు అంకితం చేశారు. కాబట్టి, ఈ కాలంలో భక్తులు శివాలయానికి పోటెత్తుతారు. అయితే, ఈ సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల పరమ శివుని ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. 

కార్తీక మాసం ఆల్రెడీ మొదలైంది. హిందూ మతంలో ఈ నెలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెలకు పరమ శివుడికి అంకితం చేశారు. శివయ్యను పూజించడంతో పాటు..... తులసి మాతను కూడా పూజిస్తారు. వీటితో పాటు.. ఈ కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల మీ విజయావకాశాలు పెరుగుతాయి. మరి, అవేంటో చూద్దాం....

శివ నామస్మరణ..

కార్తీక మాసంలో మీరు శివనామ స్మరణ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం కూడా చాలా మంచిది.

తులసి మాతను పూజించడం...

కార్తీక మాసంలో తులసి మాతకు పూజ చేయడం మంచిది. ఈ నెలలో తులసి పూజ చేయడం ద్వారా శివుడితో పాటు విష్ణు మూర్తి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కాబట్టి, కార్తీక మాసంలో తులసిని పూజించాలి . తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి.

ఆవులకు ఆహారం ఇవ్వండి.

కార్తీక మాసంలో నిశ్శబ్ద ధ్యానం చేయడం వల్ల మీకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. జంతువులపై ప్రేమ కూడా చూపించాలి. అందువల్ల, కార్తీక మాసంలో, ఆవులకు పచ్చి మేత, రోటీ లేదా జంతువులు , పక్షులు తినగలిగే ఏదైనా ఇతర ఆహారాన్ని అందించాలి.

కార్తీక మాసంలో తెల్లవారుజామున ఇలా చేయాలి....

కార్తీక మాసంలో, తెల్లవారుజామున నిద్రలేవాలి. అంటే, బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి. ముందుగా స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. తర్వాత దామోదర అష్టకాన్ని భక్తితో పఠించాలి. దీనితో పాటు, ఈ సమయంలో విష్ణు నామాలను, శివ నామస్మరణ చేయాలి.