నరక చతుర్దశి రోజు ఆడపడుచులతో సోదరులకు హారతి ఇప్పించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?
మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఎన్నో పండుగలను ఎంతో సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఘనంగా చేసుకుంటాము. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఆశ్వయిజ మాసం చివరి అమావాస్య రోజు జరుపుకునే పండుగను దీపావళి పండుగను ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ పండుగను జరుపుకుంటారు.
మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఎన్నో పండుగలను ఎంతో సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఘనంగా చేసుకుంటాము. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఆశ్వయిజ మాసం చివరి అమావాస్య రోజు జరుపుకునే పండుగను దీపావళి పండుగను ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజు ఇంటి ఆడపడుచులు ఎక్కడ ఉన్నా కానీ తమ పుట్టింటికి చేరుకుంటారు.
దీపావళికి ముందు రోజున నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. ఈ నరక చతుర్దశి రోజున ఇంటి ఆడబిడ్డలు ఇంట్లో తమ సోదరులకు తలంటు నూనె రాసి వారికి హారతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా హారతులు ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే...నరక చతుర్దశి రోజు ఇంటి ఆడపడుచు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి అనంతరం ఇంట్లో పూజా కార్యక్రమాలను పూర్తి చేయాలి.
ఇలా పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం తమ సోదరులకు తలంటు నూనె రాసి వారికి మంగళహారతి ఇచ్చి నుదుటిన బొట్టు పెట్టాలి. ఇలా తమ సోదరులు ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో వారికి హారతులు ఇచ్చి ఆడపడుచులు వారి సంతోషాన్ని కోరుకుంటారు. అనంతరం తమ సోదరుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి.
ఇకపోతే దీపావళి పండుగ సందర్భంగా సోదరులు కూడా తమ సోదరీమణులకు పెద్ద ఎత్తున కానుకలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా దీపావళి రోజున ఆడపడుచుల చేత హారతి తీసుకోవడం వల్ల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఎంతో సంతోషంగా ఉంటారని అలాగే తమ సోదరుల పేరుతో దీపదానం చేయటం వల్ల తమ సోదరులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలను కలిగి ఉంటారు. అందుకే దీపావళి పండుగ సందర్భంగా ఆడపడుచులు ఎక్కడ ఉన్న ఇంటికి చేరుకొని మంగళ హారతులు ఇవ్వడం జరుగుతుంది.
ఇక నరక చతుర్దశి తర్వాత రోజున దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి పూజ చేసి ఇల్లు మొత్తం దీపాలను నింపి సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇలా దీపం వెలిగించడం వల్ల అంధకారాన్ని తొలగించి వెలుగులను నింపుతుంది అలాగే మన జీవితంలో కూడా ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని దీపాన్ని వెలిగిస్తాము. ఇక దీపావళి పండుగను జరుపుకోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అయితే చెడుపై మంచి విజయం సాధించడంతోనే ప్రజలందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.