Asianet News TeluguAsianet News Telugu

తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే..?

తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థం.

What if the basil plant suddenly dries ..?
Author
Hyderabad, First Published Mar 26, 2021, 2:28 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

What if the basil plant suddenly dries ..?

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల  అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ, ఈ తులసి మొక్క తన సహజరంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలు.

తులసిలో మార్పులు... వాటి అర్థం తెలుసుకుందాం...

1. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థం.

2. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుంది.

3. పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.... ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం.

4. చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే... ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయి.

దీనినిబట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు... తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క తప్పక వుండాలి. తులసి ఆరోగ్యదాయిని, ఔషద గుణం కలిగినది.

Follow Us:
Download App:
  • android
  • ios