Asianet News TeluguAsianet News Telugu

బతుకమ్మల పేర్లు

 1 అక్టోబర్ 2021 శుక్రవారం, దశమి రోజు బొడ్డెమ్మ పండగ,  మొదటి బతుకమ్మ "ఎంగిలి పూల బతుకమ్మ" ను పేరుస్తారు.  

The special News of bathukamma
Author
Hyderabad, First Published Sep 29, 2021, 3:15 PM IST

 


* 1 అక్టోబర్ 2021 శుక్రవారం, దశమి రోజు బొడ్డెమ్మ పండగ,  మొదటి బతుకమ్మ "ఎంగిలి పూల బతుకమ్మ" ను పేరుస్తారు.  

 * రెండవ బతుకమ్మ " అటుకుల బతుకమ్మ"  :- 6 అక్టోబర్ 2021 బుధవారం, మహాలయ అమావాస్య రోజు...  తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

* మూడవ బతుకమ్మ " ముద్దపప్పు బతుకమ్మ"  :- 7 అక్టోబర్ 2021 గురువారం, ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.

* నాల్గవ బతుకమ్మ " నానబియ్యం బతుకమ్మ " :-  8 అక్టోబర్ 2021 శుక్రవారం, నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

* ఐదవ బతుకమ్మ " అట్ల బతుకమ్మ "  :- 9 అక్టోబర్ 2021 శనివారం, అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

* ఆరవ బతుకమ్మ " అలిగిన బతుకమ్మ"  :- 10 అక్టోబర్ 2021 ఆదివారం, ఈ రోజు నైవేద్యం సమర్పించరు.

* ఏడవ బతుకమ్మ " వేపకాయల బతుకమ్మ"  :- 11 అక్టోబర్ 2021 సోమవారం, బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

* ఎనిమిదవ బతుకమ్మ " వెన్నముద్దల బతుకమ్మ "  :- 12 అక్టోబర్ 2021 మంగళవారం, నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.

* తొమ్మిదో రోజు " సద్దుల బతుకమ్మ "  :- 13 అక్టోబర్ 2021 బుధవారం, ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.


ముఖ్యగమనిక :- ఈ పండగకు ప్రాంతాల వారికి భేదాభిప్రాలు ఉన్నాయి. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios