దీపావళికి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి జరుపుకోవడానికి గల కారణం ఏంటి?
మన హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే పండుగలను ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబర్ 24 వ తేదీ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
మన హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే పండుగలను ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబర్ 24 వ తేదీ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే దీపావళి పండుగను కొన్ని ప్రాంతాలలో ఐదు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఈరోజు కూడా చాలామంది దీపాలను వెలిగించి ఈ పండుగను చేసుకుంటారు. ఇలా నరక చతుర్థి కూడా ఘనంగా జరుపుకోవడానికి గల కారణం ఏంటి? అసలు నరక చతుర్దశి వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయానికి వస్తే...
పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు వరాహ అవతారంలో ఉన్నప్పుడు భూదేవికి విష్ణుమూర్తికి నరకాసురుడు జన్మిస్తారు. నరకాసురుడు ఓ పెద్ద రాక్షసుడుగా మారి నరకం అనే ఒక ప్రాంతాన్ని సృష్టించుకుని అక్కడ నివసించే ప్రజలను పెద్ద ఎత్తున హింసించేవారు. ఇకపోతే నరకాసురుడు ఘోర తపస్సు చేసి శివుడి అనుగ్రహాన్ని కూడా పొందారు.
ఇలా నరకాసురుడి తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు తనకు తన తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో కూడా మరణం లేదనే వరం ఇచ్చాడు. శివుడు ఇలాంటి వరం ఇవ్వడంతో నరకాసురుడి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోయాయి.ఈ విధంగా నరకాసురుడు దేవతలు ప్రజలు అనే తేడా లేకుండా అందరినీ హింసిస్తున్న తరుణంలో దేవతలు అందరూ శ్రీమహావిష్ణువును శరణు కోరారు.
ఈ క్రమంలోనే మహావిష్ణువు శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరినీ నరకాసురుడిపై యుద్ధానికి వెళ్ళమని చెప్పారు. ఈ క్రమంలోనే సత్యభామ భూదేవిగా మారి నరకాసురుడిని సంహరిస్తుంది.ఇలా ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నరకాసురుడు చనిపోవడం వల్ల ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఈ విధంగా దీపావళికి ముందు రోజు కూడా చాలామంది దీపాలను వెలిగించి ఇలా నరక చతుర్థి పండుగను జరుపుకుంటారు.