వివిధ సమస్యలకు హనుమత్ ఆరాధన విధి విధానాలు
అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు. వానినే హనుమన్నవావతారాలంటారు.
హనుమంతుని తొమ్మిది అవతారాలు. ఏ దైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారా లెత్తడం జరుగుతుంది. అదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు
''పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే '' .. అని చెప్పాడు.
అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు. వానినే హనుమన్నవావతారాలంటారు.
వానిని పరాశరమహర్షి :-
1. ప్రసన్నాంజనేయస్వామి అవతారం, 2. వీరాంజనేయస్వామి, 3. వింశతి భుజానేంజనేయస్వామి, 4. పంచముఖాంజనేయస్వామి, 5. అష్టాదశభుజాంజనేయస్వామి, 6. సువర్చలాంజనేయస్వామి, 7. చతుర్భుజాంజనేయస్వామి, 8. ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి,
9. వానరాకార ఆంజనేయస్వామిఅవతారం.
అలాగే హనుమంతునకు సంబంధించిన పుణ్య స్థావరాలు కూడా పదమూడు ఉన్నాయి. వాటినే హనుమత్పీఠాలంటారు. అవి 1. కుండినగరం, 2. శ్రీ భద్రము, 3. కుశతర్పణము, 4. పంపాతీరం, 5. చంద్రకోణం, 6. కాంభోజం, 7. గంధమాదనం, 8. బ్రహ్మావర్తపురం, 9. బార్హస్పత్యపురం, 10. మాహిష్మతీపురం, 11. నైమిశారణ్యం, 12. సుందరీనగరం, 13. శ్రీ హనుమత్పురము – అనేవి.
ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి.
1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు:- ఆవనూనెతో దీపారాధన – ఆరోగ్యం.
2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి :- గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి:- బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి :- నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
5. కోరికలు నెరవేరేందుకు :- బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి :- కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి :- పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.
8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు :- ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.
గమనిక : – ఈ పరిహారాల్లో దేన్నైనా ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చును.
ఆంజనేయస్వామిని చూసి జడుసుకున్న శనీశ్వరుడు.. దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి.
శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.
రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు.
ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు.
కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.
కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.
అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు.
దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.
అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151