Spiritual: ఈ ఆలయాన్ని దర్శించండి.. శని ప్రభావం, అనారోగ్యం నుండి ఇట్టే తప్పించుకోండి?
Spiritual: ఎన్ని చికిత్సలు తీసుకున్నా అనారోగ్యం తగ్గటం లేదా.. అలాగే శని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతున్నారా.. అయితే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. అది ఏ ఆలయం.. ఎక్కడ ఉంది? దాని విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం.
మనకి ఆరోగ్యం సహకరించినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మానవ ప్రయత్నం సరిపోనప్పుడు మనం చూసేది ఆ దేవుడివైపే. మనం ఈరోజు పడుతున్న బాధ అంతా మన గ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది అలాంటి గ్రహాలలో సూర్య భగవానుడు ముఖ్యమైన వాడు.
ఆయన ఇతర గ్రహాలతో కలిసి వెలసిన ప్రాంతం కుంభకోణం లోని సూర్యనారాయణ దేవాలయం. ఇది చాలా విశిష్టమైనది. శని బాధ నివారణ అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఆలయానికి వెళ్లి రావాల్సిందే. సాధారణంగా నవగ్రహాల ఆలయంలో శివుడు ప్రధానంగా ఉంటే తమిళనాడు రాష్ట్రం కుంభకోణం లోని సూర్యనారాయణ ఆలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం.
ఈ ఆలయంలోని మూలవిరాట్ అయిన సూర్య భగవానుడు తన ఇద్దరి భార్యలతో భక్తులకి దర్శనం ఇస్తాడు. మిగిలిన సూర్య దేవాలయాలలో సూర్యుడు తీవ్రమైన కిరణాలతో ఉంటే ఇక్కడ మాత్రం స్వామి వారు చిరు మందహాసంతో చేతులలో తామర పూలు పట్టుకొని ఆశీర్వదిస్తూ ఉంటారు.
పరమశివుడి ఎదురుగా నంది ఉన్నట్లు సూర్యుని ఎదురుగా గుర్రం ఉంటుంది ఎక్కడ రథసప్తమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో సూర్యనార్ ఆలయాన్ని మహారాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
ఇక్కడ అనారోగ్య సమస్యలు, కుజదోషం, ఏలినాటి శని, జాతక చక్రంలో రాహు కేతు దోషాలు వంటివి ఉంటే ఈ ఆలయాన్ని దర్శించుకుని పూజిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. సూర్యభగవానుడితో పాటు గురుడిని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శని తో పాటు ఇతర గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి అని ఇక్కడ పండితులు చెప్తున్నారు.
ఈ ఆలయంలో పూజ చాలా నిష్టగా ఉంటుంది. పూజ అనంతరం ఆలయం చెట్టు 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. సూర్య భగవానుడికి నైవేద్యంగా చక్కెర పొంగలి పెట్టాలి. ఇలా చేయటం వలన మీ సమస్యలు అన్ని తొలగిపోతాయి.