నరక చతుర్థి రోజు ఈ ప్రదేశంలో దీపం వెలిగిస్తే చాలు... కష్టాలన్నీ తిరినట్టే?
మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఎన్నో రకాల పండుగలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా దేశం మొత్తం ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ దీపావళి పండుగను ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఎన్నో రకాల పండుగలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా దేశం మొత్తం ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ దీపావళి పండుగను ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకు ముందు రోజు ధన్ తెరస్ అంటారు. దీనినే నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. మన ఇంటి ఆవరణంలో దీపం వెలిగించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
శాస్త్రం ప్రకారం నరుక చతుర్దశి రోజున యమదేవుడికి ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈరోజు యువదేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈరోజు దీపం వెలిగించడం వల్ల ఆకాల మరణం నుంచి అలాగే మృత్యు దోషాల నుంచి కూడా బయటపడవచ్చు.నరక చతుర్దశి ముందు రోజు సాయంత్రం మన ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపం వెలిగించడం వల్ల యమ దేవుడి అకాల మరణం నుంచి బయట పడటమే కాకుండా, మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం నరక చతుర్దతి తిథి 23 అక్టోబర్ 2022న సాయంత్రం 6.03 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 24న సాయంత్రం 5:27 ముగుస్తుంది. ఇక నరక చతుర్దశిని జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజల పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే ఆ రాక్షసుడికి ఒక స్త్రీ చేతిలోనే మరణం ఉంటుందని శాపం ఉంటుంది.
ఇలా స్త్రీ చేతిలో మరణం ఉందని శాపం ఉండడంతో శ్రీకృష్ణుడు తన భార్య సహాయంతో నరకాసుడిని వధిస్తారు.ఇలా నరకాసురుడి సంహరణ జరగడంతో అతని భార్య నుంచి బయటపడినటువంటి ప్రజలు సుఖసంతోషాలతో ఈ నరక చతుర్దశి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈయన మరణం తర్వాత 16,000 మంది బందీలను అతని చెర నుంచి విడిపించారని, ఇలా ఈ 16 వేల మందిని బందీలు పట్రానీలుగా పిలుస్తున్నారు. ఇలా ఆ నరకాసురుడి సంహరణ జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు దీపపు వెలుగులతో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.