Asianet News TeluguAsianet News Telugu

Dussehra 2021: గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు..!

శరన్నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి దేవి అవతారం  - నైవేద్యంగా పులిహోర 

Lord Durga devi in Gayatri Avatar Over Navaratri Celebrations
Author
Hyderabad, First Published Oct 8, 2021, 11:36 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


శరన్నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి దేవి అవతారం  - నైవేద్యంగా పులిహోర 

 పులిహోర తయారు చేయుటకు కావలసిన పదార్ధాలు :-

బియ్యం 150 గ్రాములు 
చింతపండు 50 గ్రాములు
పసుపు1/2 స్పూన్
ఎండుమిర్చి 5
ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగపప్పు 2 స్పూన్
పల్లీలు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా

చేయవలసిన విధానం :-

అన్నం వండి చల్లార్చి పసుపు, ఉప్పు, కలిపి పెట్టాలి. చింతపండును అరకప్పు నీళ్ళు పోసి నాన పెట్టి, చిక్కటి గుజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్త బెల్లం వేసి బాగా ఉడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్జులో ) ఉడికిన గుజ్జు అన్నంలో కలిపండి.

బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు, మినపప్పు, శనగ పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, వేసి ఆ వాలు చిటపట అన్న తరువాత పల్లీలు వేసి అన్నీ బాగా వేగాక కర్వేపాక్ వేసి అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీ అవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము. 
 

Follow Us:
Download App:
  • android
  • ios