Asianet News TeluguAsianet News Telugu

Ganesh Chaturthi - 2022: వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా తయారు చేయాలో తెలుసా?

దేవదేవతలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడి పూజ కోసం ఎన్నో రకాల వంటలను తయారు చేస్తుంటారు.

Ganesh Chaturthi Recipes modak recipe and preparation details inside
Author
First Published Aug 27, 2022, 5:41 PM IST

ముఖ్యంగా వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో మోదకాలు ఒకటి. ఉత్తర భారతీయులు ఎక్కువగా మోదకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మరి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలు ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే...

కావలసిన పదార్థాలు: బియ్యం పిండి ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, నీళ్లు ఒక కప్పు, కొబ్బరి తురుము ఒక కప్పు, యాలకులు ఐదు, నెయ్యి తగినంత, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు, ఉప్పు చిటికెడు

తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి అందులో చిటికెడు ఉప్పు కొద్దిగా నెయ్యి వేయాలి. నీళ్లు బాగా మరుగుతున్న సమయంలో ఒక కప్పు బియ్యప్పిండి వేసి చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడకనిచ్చి దానిని మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి అందులో కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం వేసి చిన్న మంటపై బెల్లం కరిగే వరకు వేడి చేయాలి. చివరిగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి కలిపి దించుకోవాలి.ఇక ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యపు పిండిని చేతికి తడి అద్దుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి.ఇక చిన్న చిన్న ఉండలు తీసుకొని బొటనవేలు సహాయంతో దానిని గిన్నె ఆకారంలో తయారుచేసి కొబ్బరి తురుము మిశ్రమాన్ని అందులో పెట్టి మెల్లిగా వేలిని తీసి ఆ పిండిని అదమాలి. ఇక ఈ మోదకాలను ఇడ్లీ కుక్కర్లో నెయ్యి రాసి అందులో ఇవి పెట్టి స్టీమ్ పై బాగా 10 నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో రుచికరమైన మోదకాలు తయారైనట్లే.

Follow Us:
Download App:
  • android
  • ios