నరక చతుర్దశి రోజు ఈ చిన్న పని చేస్తే చాలు నరక బాధల నుంచి విముక్తి పొందవచ్చు?
హిందూ పురాణాల ప్రకారం ఆశ్వీజమాసం చతుర్దశి రోజున సత్యభామ శ్రీకృష్ణునితో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ప్రతి ఏడాది ఈ రోజున నరుక చతుర్దశిగా జరుపుకుంటారు.
హిందూ పురాణాల ప్రకారం ఆశ్వీజమాసం చతుర్దశి రోజున సత్యభామ శ్రీకృష్ణునితో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ప్రతి ఏడాది ఈ రోజున నరుక చతుర్దశిగా జరుపుకుంటారు. ఇక దీపావళికి ఒక రోజు ముందు రోజున నరక చతుర్దశి అంటారు. ఈ నరక చతుర్దశి రోజు ప్రత్యేకంగా శ్రీకృష్ణుడికి యమదేవుడికి పూజ చేయటం వల్ల నరక బాధల నుంచి మనం విముక్తి పొందుతాము.అయితే నరక చతుర్థి రోజు ఏ విధంగా పూజ చేయాలి అనే విషయానికి వస్తే...
నరుక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలకు నువ్వుల నూనె రాసిన అనంతరం తలంటు స్నానం చేయాలి.అయితే స్నానం చేసేముందు ఉత్తరేణి ఆకును తలపై పెట్టుకొని తలంటు స్నానం చేయడం ఎంతో శుభ సూచికం. ఇలా తలస్నానం పూర్తి అయిన అనంతరం యమ దేవుడిని స్మరించుకుంటూ తర్పణం ఇవ్వడం వల్ల యమ పాపాల నుంచి మనం బయటపడటమే కాకుండా మరణించిన మన పూర్వీకులకు యమలోకంలో బాధలు తొలగి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విధంగా యమ దేవునికి తర్పణం వదిలే ముందు యమ నామాలను పలుకుతూ తర్పణం వదలడం మంచిది. యమాయ నమః మృత్యవే నమః వైవస్వతాయ నమః సర్వ భూత ప్రదాయైనమః ఘనాయ నమః పరమేష్టినే నమః చిత్రాయ నమః ధర్మరాజాయ నమః అంతకాయ నమః కాలాయ నమః గౌతమ వరాయ నమః అనేవి యమ నామాలు వీటిని ఒక్కో నామాన్ని చదువుతూ నువ్వులతో యమదేవుడికి తర్పణం వదలాలి.
ఇక ఈ నరక చతుర్దశి రోజున దీప దానం చేయడం ఎంతో మంచిది. ఈ విధంగా దీపాలను దానం చేయటం వల్ల నరకంలో ఉండే వారికి వెలుతురును ఇవ్వడానికి అలాగే యమ దారిలో వెళ్లే వారికి పుణ్యం కలగడం కోసం దీపదానం చేస్తారు. మనం ఎవరినైతే తలచుకొని దీపాన్ని దానం చేస్తామో ఆ దీప దాన పుణ్యం వారికి కలుగుతుంది.
ఇక పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు 16,000 మంది రాజకన్యలను, భూలోక వాసుల ఐశ్వర్యాలను దేవతల సంతోషాన్ని హరిస్తాడు.అయితే నరకాసురుడి బాధ నుంచి వీరికి విముక్తి కలగడం కోసం శ్రీకృష్ణుడు సతీసమేతంగా భూలోకానికి వచ్చి సత్యభామ చేత నరకాసురుడిని సంహరిస్తారు. ఇలా నరకాసురుడు చనిపోయిన తర్వాత వీరందరికీ ఆయన బాధ నుంచి విముక్తి కలుగుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుడిపై విజయం సాధించిన అనంతరం అదితి కుండలాలను తిరిగి ఆమె కప్పగించి, 16 వేల మందిని కన్యలను వివాహం చేసుకుంటాడనీ పురాణాలు చెబుతున్నాయి.