దీపావళి 2023: ఇలాంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని దీపావళికి ఇంటికి తీసుకొస్తే మీ జీవితాంతం డబ్బుకు కొదవే ఉండదు
Diwali 2023: సనాతన ధర్మంలో దీపావళి పండుగను ఎంతో పవిత్రమైన పండుగగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవి విగ్రహాలను కూడా కొంటూ ఉంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని నమ్ముతారు. అయితే లక్ష్మీదేవి విగ్రహాలను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి.
Diwali 2023: హిందువుల అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి పండుగను ఈ నెల 12న జరుపుకోబోతున్నాం. పండుగ దగ్గరకొచ్చింది కాబట్టి.. ఇప్పటికే ఇళ్లను శుభ్రం చేయడం, ఇంట్లోని పాత వస్తువులను పారేయడం వంటి పనులను మొదలు పెట్టే ఉంటారు. అయితే దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహాలను కూడా కొంటూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలేం రావని, ఇంట్లో సిరి, సంపదలు వెళ్లివిరుస్తాయని నమ్ముతారు. అయితే అమ్మవారి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఈ తప్పులు గనుక చేశారంటే మీరు జీవితంలో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. మరి ఎలాంటి అమ్మవారి విగ్రహాన్ని కొంటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చోవాలి
అమ్మవారికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టమట. అందుకే మీరు ఈ దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనాలనుకుంటే.. అమ్మవారు తామర పువ్వుపై కూర్చున్న విగ్రహాన్నే కొనండి. అంటే బురదలో ఉన్నా కూడా కమలం ఎంతో అందంగా వికసిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ జీవితంలోని ప్రతికూలతను నివారించాలని ఈ విగ్రహం మనకు సూచిస్తుందన్న మాట.
లక్ష్మీదేవి విగ్రహం నిలబడి ఉండకూడదు
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవి విగ్రహం ఎప్పుడూ కూడా కూర్చున్న భంగిమలోనే ఉండాలి. ఈ భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటుందని నమ్మకం. అదే నిలబడి ఉన్న విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకొస్తే అమ్మవారు మీ ఇంటినుంచి చాలా త్వరగా వెళ్లిపోతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి చేతుల మీదుగా బంగారు నాణేలు
లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈ దీపావళికి కొనాలంటే అమ్మవారి చేతుల నుంచి నాణేలు బయటకు వచ్చే విగ్రహాన్నే కొనండి. ఇలాంటి విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు రావు. అలాగే డబ్బుకు కొదవ ఉండదు.
లక్ష్మీదేవి విగ్రహంలో ఏనుగులు
ఏనుగులు రెండు వైపుల నుంచి డబ్బుల వర్షం కురిపిస్తున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు.