అప్పుడు ఒలింపిక్ విజేత, ఇప్పుడు ప్రేక్షకుడు: సుశీల్ కుమార్ కి జైల్లో టీవీ..!
ఈ టోక్యో ఒలంపిక్స్ జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా.. వీటిని చూసేందుకు తనకు జైల్లో టీవీ కావాలంటూ ఈ నెల 2వ తేదీన సుశీల్ కుమార్.. అధికారులను కోరాడు.
రెండుసార్లు ఒలంపిక్ విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ ఇటీవల హత్య కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయనకు టీవీ సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు చెప్పారు. త్వరలో టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఒలంపిక్స్ మ్యాచ్ వీక్షించేందుకు వీలుగా.. ఆయనకు జైల్లో టీవీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ టోక్యో ఒలంపిక్స్ జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా.. వీటిని చూసేందుకు తనకు జైల్లో టీవీ కావాలంటూ ఈ నెల 2వ తేదీన సుశీల్ కుమార్.. అధికారులను కోరాడు.
‘ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి... వీటితో పాటు టోక్యో ఒలింపిక్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఒక అథ్లెట్‌గా తనకు ఆ మ్యాచ్‌లు చూడటం చాలా అవసరం. అంతర్జాతీయ వేదికలపై జరుగుతున్న క్రీడలను తప్పకుండా చూడాలి కాబట్టి తన గదిలో టీవీ ఏర్పాటు చేయాలని’ సుశీల్ డిమాండ్ చేశాడు. ఆయన కోరిక మేరకు అధికారులు టీవీ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మే 4న ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో హాకీ స్టిక్కులు, బేస్ బాల్ బ్యాట్లతో సుశీల్ కుమార్ అతడి స్నేహితులు దాడి చేయడంతో సాగర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయిన సుశీల్ దాదాపు మూడు వారాల తర్వాత సోనేపట్ సమీపంలో పోలీసులకు చిక్కాడు.