ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 19-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలయ్యింది.

క్వార్టర్స్, సెమీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ఫైనల్లో తన మ్యాజిక్ చూపించలేకపోయింది. తొలి సెట్లో గట్టిపోటినిచ్చినప్పటికీ.. తర్వాత యమగూచి ధాటికి సింధు తలవంచక తప్పలేదు. అయితే గతంలో యమగూచిపై సింధుకి మెరుగైన రికార్డు ఉంది.