Asianet News TeluguAsianet News Telugu

ప్రో కబడ్డి 2019: హోరాహోరీ పోరు...హర్యానా చేతిలో చిత్తయిన బెంగాల్

దేశ రాజధాని న్యూడిల్లిలో జరుగుతున్న ప్రో కబడ్డి సీజన్ 7లో హర్యానా జట్టు విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ ను కేవలం 3 పాయింట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.  

pro kabaddi 2019: haryana steelers victory against bengal warriors
Author
New Delhi, First Published Aug 26, 2019, 8:49 PM IST

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో బెంగాల్ వారియర్స్ మరో ఓటమిని చవిచూసింది. దేశ రాజధాని డిల్లీలోని త్యాగరాయ స్పోర్ట్ కాంప్లెక్స్ వేదికన జరిగిన మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ అదరగొట్టింది. బెంగాల్ జట్టులో హోరాహోరీగా పోరాడి చివరకు కేవలం 3పాయింట్ల స్వల్ప తేడాతో విజయం సాధించింది. బెంగాల్ స్టార్ రైడర్ మణిందర్ సింగ్ 15 పాయింట్లతో చెలరేగినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 

హర్యానా జట్టు రైడింగ్ లో 24, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 3 ఇలా మొత్తం 36 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో వికాస్ 11, వినయ్ 9 పాయింట్లతో అదరగొట్టారు. మిగతావారిలో ధర్మరాజ్ 4, ప్రశాంత్, వికాస్ 2 పాయింట్లతో పరవాలేదనిపించారు. 

బెంగాల్ జట్టు చివరివరకు హర్యానాకు గట్టిపోటీనిచ్చి కేవలం 3 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. రైడింగ్ లో 25 పాయింట్లతో హర్యానాకంటే మెరుగైన ప్రదర్శన  చేసిన  బెంగాల్ డిఫెండింగ్ విషయంలో వెనుకబడింది. దీంతో ట్యాకిల్స్ లో కేవలం 5 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇక ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 2 ఇలా మొత్తం  33 పాయింట్లు మాత్రమే సాధించి స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

ఆటగాళ్లలో మణిందర్ 15 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.  అలాగే  ప్రభంజన్ 7, జీవన్ 3, ఇస్మాయిల్ 3  పాయింట్లతో పరవాలేదనిపించాడు. అయితే మిగతా ఆటగాళ్లెవరూ కనీస పాయింట్లు కూడా సాధించకోవడంతో బెంగాల్ వారియర్స్  ఓటమిని తప్పించుకోలేకపోయింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios