ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలని ఉంది.. : చెస్ ప్రపంచ కప్ తర్వాత భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద
New Delhi: గురువారం బాకులో జరిగిన ఫిడే వరల్డ్ కప్ ఫైనల్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్లో క్లాసికల్ గేమ్స్ ప్రతిష్టంభనలో ముగియడంతో టై బ్రేక్స్ లో కార్ల్ సన్ చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యాడు. చెస్ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Indian Grandmaster R Praggnanandhaa: గురువారం బాకులో జరిగిన ఫిడే వరల్డ్ కప్ ఫైనల్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్లో క్లాసికల్ గేమ్స్ ప్రతిష్టంభనలో ముగియడంతో టై బ్రేక్స్ లో కార్ల్ సన్ చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యాడు. చెస్ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తనకు దక్షిణ భారత వంటకాలను తినాలని ఉందని ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ చెప్పారు.
వివరాల్లోకెళ్తే.. చెస్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వీరోచిత ప్రదర్శన చేసిన ఆర్.ప్రజ్ఞానంద ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి చెస్ స్టార్లలో ఒకరిగా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. 2023 చెస్ వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరిన ప్రజ్ఞానంద కోట్లాది మంది దృష్టిని ఆకర్షించాడు. చివరి వరకు వీరోచితంగా పోరాడినా చివరికి ఫైనల్లో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ఓడిపోయాడు. అజర్ బైజాన్ లోని బాకులో గురువారం జరిగిన మ్యాచ్ లో తొలి రెండు క్లాసికల్ గేమ్ లను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నప్పటికీ టై బ్రేకర్ లో కార్ల్ సన్ మరింత ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా, నెం.2 ఫాబియానో కరువానాలను ఓడించిన ప్రజ్ఞానంద చెస్ వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. రజత పతకం సాధించడం ద్వారా ప్రజ్ఞానంద ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు కూడా టికెట్ దక్కించుకున్నాడు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. ఇప్పుడు వరల్డ్ కప్ ముగియడంతో తాను దక్షిణ భారత ఆహారాన్ని తినాలనుకుంటున్నానని చెప్పినట్టు ఎన్డీటీవీ నివేదించింది. 'ఇక్కడ తినే ఆహారం కంటే ఇండియన్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాను. సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలని అనుకుంటున్నాను. మా జట్టులో డి.గుకేష్, అర్జున్ ఎరిగాయిసీ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరింత బలపడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే గుకేష్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. మేము కూడా టాప్-10లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఫిడే వరల్డ్ కప్ లో ప్రజ్ఞానంద డ్రీమ్ రన్ ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ఓటమితో ముగిసింది.
రెండవ 25+10 టై-బ్రేక్ గేమ్ 22 కదలికలలో డ్రాగా ముగిసింది. దీంతో నార్వేజియన్ లెజెండ్ తన చివరి గేమ్ నైపుణ్యాలను ప్రదర్శించి మొదటి విజయం సాధించిన తర్వాత సురక్షితంగా ఆడాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న కార్ల్‌సెన్‌కి ఇది మొదటి ప్రపంచ కప్ విజయం. తొలి టై బ్రేక్ గేమ్ లో 18 ఏళ్ల భారత ప్రత్యర్థి నుంచి గట్టి సవాలును ఎదుర్కొన్న కార్ల్ సన్ 45 మూవ్స్ లో విజయం సాధించాడు.