నీరజ్ చోప్రా మరో ఘనత: జావెలిన్ త్రో పురుషుల విభాగంలో వరల్డ్ నెంబర్ వన్
నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో పురుషుల విభాగంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించాడు.
న్యూఢిల్లీ: ఇండియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచారు. 1455 పాయింట్లతో నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలిచాడు. వరల్డ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ ను వెనక్కి నెట్టి నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలిచాడు.
దోహాలో జరిగిన డైమండ్ లీగ్ ఈవెంట్ లో నీరజ్ చోప్రా విజయం సాధించారు. 2023 . 2021 లో ఒలింపిక్ లో బంగారు పతాకాన్ని నీరజ్ చోప్రా గెలుపొందారు. ఒలంపిక్ లో బంగారు పతకం గెలుపొందిన రెండో అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు.
2018లో కామెన్ వెల్త్ గేమ్స్,ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా బంగారు పతాకాలు సాధించారు. 2022 సీజన్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో విజృంభించాడు.
యూజీన్ లో జరిగిన పోటీల్లో సిల్వర్ పతకాన్ని సాధించారు. గాయం కారణంగా కామన్ వెల్త్ గేమ్స్ లో ఆయన పాల్గొనలేదు.
నెదర్లాండ్స్ లోని హెంగెలోలో జరిగే ప్యాన్సీ బ్లాంకర్స్ కోయెన్ గేమ్ లో నీరజ్ చోప్రా పాల్గొంటారు. ఆసియా క్రీడలు 2023, పారిస్ ఒలంపిక్స్ కోసం నీరజ్ చోప్రా సన్నద్దమౌతున్నాడు. మరో వైపు ఈ ఏడాది జూన్ 13న ఫిన్‌లాండ్ లో ఫావో నూర్మి క్రీడల్లో ఆయన పాల్గొంటారు