Asianet News TeluguAsianet News Telugu

విషాదం...తెలంగాణలో జాతీయస్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడి ఆత్మహత్య

కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన  రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

national  level restling player suicide at telangana
Author
Sircilla, First Published Jul 6, 2020, 11:51 AM IST

హైదరాబాద్: కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ రెజ్లింగ్ క్రీడాకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన  రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గతకొంత కాలంగా చోటుచేసుకున్న పరిణామాలు అతడి ఆటకు ఆటంకం కలిగించడమే కాదు ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయి. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ కు చెందిన  శ్రీనివాస్(24) జాతీయ స్థాయి రెజ్లింగ్ లో సత్తా చాటాడు. అయితే  కరోనా  వైరస్ విజృంభణతో దేశవ్యాప్తంగా క్రీడా ఈవెంట్లు నిలిచిపోయాయి. దీంతో శ్రీనివాస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.

read more   మాజీ క్రికెటర్‌కు కరోనా... ఫ్లాస్మా చేయించాలని గంభీర్ విజ్ఞప్తి, చివరికి

ఈ క్రమంలో శ్రీనివాస్ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. పంటకు పిచికారీ చేసే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయిన అతడికి ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలాడు. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కరోనా కష్టాలు మంచి క్రీడాకారున్ని బలితీసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios