Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: ఫిజియోని అడగడం నేరమా..? వినేశ్ ఫోగట్..!

ఫిజియోని వెంట తీసుకువెళతామని అడగడం నేరం కాదు కదా అని ఆమె ట్వీట్ చేశారు. ఈ డిమాండ్ తాము ఇప్పటికిప్పుడు అడుగుతున్నది కాదని.. ఎప్పటి నుంచో అడుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.

Is It A Crime To Ask For Physiotherapist...": Wrestler Vinesh Phogat On Request For Physiotherapist Travelling To Tokyo Olympics
Author
Hyderabad, First Published Jul 23, 2021, 8:36 AM IST

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ నుంచి మహిళా వెస్ట్రలర్ వినేశ్ ఫోగట్ పాల్గొననున్నారు. ఆమె కచ్చితంగా పథకంతో తిరిగి స్వదేశానికి చేరుకుంటారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా.. తాజాగా.. ఆమె ఈ టోక్యో ఒలంపిక్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ టోక్యో ఒలంపిక్స్ లో తమతోపాటు ఒక ఫిజియో థెరపిస్ట్ ని కూడా అనుమతించాలంటూ ఎంతో కాలంగా కోరుతున్నానమని.. కానీ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలదేని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురు వెస్ట్రలర్ లకు కనీసం ఒక్క ఫిజియో థెరపిస్ట్ ని అనుమతించడానికి ఏంటి సమస్య అని ప్రశ్నించారు.

ఫిజియోని వెంట తీసుకువెళతామని అడగడం నేరం కాదు కదా అని ఆమె ట్వీట్ చేశారు. ఈ డిమాండ్ తాము ఇప్పటికిప్పుడు అడుగుతున్నది కాదని.. ఎప్పటి నుంచో అడుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.

కొందరు క్రీడాకారులకు చాలా మంది కోచ్ లు ఉంటున్నారని.. వారందరినీ అనుమతి ఇస్తున్నారు కానీ.. తమకు మాత్రం ఫిజియోని అనుమతించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా వినేశ్ ఫోగట్... 53కేజీల విభాగంలో పోటీపడుతున్నారరు. ఆమె తొలి మ్యాచ్ ఆగస్టు 5వ తేదీన జరగనుంది.  2016లో జరిగిన రియో ఒలంపిక్స్ లో వినేశ్ ఫోగట్.. తీవ్రంగా గాయపడ్డారు. మళ్లీ ఆమె కోలుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలోనే ఆమె..  తమ వెంట ఫిజియోని అనుమతించమని అడుగుతుండటం గమనార్హం. 


 

Follow Us:
Download App:
  • android
  • ios