ప్రపంచం నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్ ను ఓడించిన భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
Rameshbabu Praggnanandhaa : భారత గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ను కు షాకిచ్చాడు. నార్వే చెస్ టోర్నమెంట్ లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ పై తొలి క్లాసికల్ గేమ్ విజయం సాధించాడు.
Rameshbabu Praggnanandhaa : నార్వే చెస్ టోర్నమెంట్ లో భారత గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద (ఆర్ ప్రజ్ఞానంద) ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్ సన్ పై తొలి క్లాసికల్ గేమ్ విజయం సాధించాడు. ర్యాపిడ్/ఎగ్జిబిషన్ గేమ్స్ లో పలుమార్లు కార్ల్ సన్ ను ఓడించిన ఈ 18 ఏళ్ల భారత ఆటగాడు మూడు రౌండ్ల తర్వాత 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. చెన్నై నివాసి ప్రజ్ఞానంద జనవరిలో ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులలో ఒకరైన, ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు. టాటా స్టీల్ మాస్టర్స్‌లో మూడు రౌండ్ల డ్రా తర్వాత, అతను నాలుగో రౌండ్‌లో గెలిచాడు. ప్రజ్ఞానంద ఫీడ్ రేటింగ్ పాయింట్లు ఆ సమయంలో 2748.3గా ఉన్నాయి. మరోవైపు, విశ్వనాథన్ ఆనంద్ ఫీడ్ రేటింగ్ పాయింట్లు 2748 వద్ద ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, అతన్ని కూడా అధిగమించాడు.
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద. ఎందుకంటే ఈసారి చెస్ పోటీలో నార్వేలో మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించాడు. 18 ఏళ్ల ఈ యువ చెస్ ఆటగాడు అతనిని అరవై నాలుగు ఎత్తుగడల్లో ఓడించాడు. ప్రజ్ఞానంద తన 5 సంవత్సరాల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాడు. ఈ 18 సంవత్సరాలకు చేరుకోవడానికి ముందు, ప్రజ్ఞానంద అనేక టైటిల్స్ గెలుచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించిన మంచి గుర్తింపు లభించింది. అతడిని ప్రోత్సహించేందుకు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ముందుకొచ్చాడు. ఈసారి మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించింది ప్రజ్ఞానంద. నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్ ముగిసే సమయానికి, ప్రజ్ఞానంద 5.5 వద్ద పాయింట్లు సాధించి టాప్ లో ఉన్నాడు.
టెన్షన్ పెంచుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 వరల్డ్ కప్ 2024కు ఉగ్రముప్పు