టోక్యో పారాలింపిక్స్ కి జావెలిన్ త్రోవర్ దేవేంద్ర జాజారియా..!
దేవేంద్ర జాజారియా తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఇలా తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవడం వల్ల తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు
పారాలింపియన్ జావెలిన్ త్రోవర్ దేవేంద్ర జాజారియా.. వచ్చే నెలలో జరగనున్న టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జావెలిన్ ని విసిరి.. జాజారియా.. తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. గతంలో.. 63.97మీటర్ల దూరం విసిరగా.. ఈ సారి 65.71 మీటర్ల దూరం విసిరారు.
కాగా.. దేవేంద్ర జాజారియా.. ఇప్పటి వరకు రెండు స్వర్ణాలను గెలిచారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గెలిచిన ఆయన.. గతంలో.. రియో ఒలంపిక్స్, పారా ఒలంపిక్స్ లో స్వర్ణాలను సాధించారు.
కాగా.. తాజాగా.. దేవేంద్ర జాజారియా తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఇలా తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవడం వల్ల తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు.
"గత రెండు సంవత్సరాలుగా నేను పూర్తిగా దృష్టి సారించాను, నా శిక్షణపై దృష్టి కేంద్రీకరించాను. వాస్తవానికి, లాక్డౌన్ సమయంలో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ పొందాను. నేను నెలల తరబడి నా కుటుంబ సభ్యులను కూడా చూడలేదు, కానీ నా దేశం కోసం మూడవ బంగారాన్ని పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను . నేను దాన్ని పొందుతానని ఖచ్చితంగా అనుకుంటున్నాను. " అని చెప్పారు.
భారతదేశపు అత్యున్నత క్రీడా గౌరవాన్ని పొందిన మొదటి పారా అథ్లెట్ జాజారియా కావడం గమనార్హం. కాగా..గత ఏడాది అక్టోబర్‌లో దేవేంద్ర జాజారియా తన తండ్రిని కోల్పోయాడు. కాగా.. ఆ తర్వాత తన తల్లి.. తనను ప్రోత్సహించి.. దేశంలో కోసం ఆడాలని చెప్పిందని గుర్తు చేసుకున్నాడు.
"అటువంటి పరిస్థితిలో నా తల్లిని విడిచిపెట్టడం నాకు చాలా కష్టమైంది, కాని నేను దేశానికి ప్రాధాన్యత ఇచ్చాను. దాదాపు ఏడు నెలల నుంచి నా కుటుంబసభ్యులు ఎవరినీ కలవలేదు. గాంధీ నగర్ శిక్షణా కేంద్రంలోనే నేను ఉండిపోయాను. నా ఆరేళ్ల కొడుకు మాత్రం.. నేను ఇంటికి రావాలంటూ పట్టుపట్టేవాడు.’’ అని జారిజాయా చెప్పడం గమనార్హం.
రాజస్థాన్ లోని చురులో జన్మించిన జాజారియా .. చిన్న తనంలో తన గ్రామంలో ఒక చెట్టు ఎక్కేటప్పుడు హై-వోల్టేజ్ వైర్ తగిలింది. ఈ క్రమంలో అతను చేతులు కోల్పోయాడు. కాగా.. జాజారియా 2004 ఏథెన్స్ గేమ్స్ ,2016 రియో పారాలింపిక్స్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. అతను 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.