మహిళా బాక్సర్ సరితాదేవికి కరోనా పాజిటివ్
జాతీయ బాక్సింగ్ శిక్షణ శిబిరం పాటియాలాలో నడుస్తున్నా, కరోనా వల్ల సరితాదేవి తన స్వస్థలమైన మణిపూర్ లోనే ఉండిపోయారు. మరోవైపు సైక్లిస్ట్ త్రియాషా పాల్ కరోనా బారిన పడ్డారు.
భారత మహిళా బాక్సర్ సరితాదేవికి కరోనా వైరస్ సోకింది. ఆమె భర్త కూడా కరోనా బారిన పడటం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె భర్త స్వయంగా వెల్లడించారు.
‘‘ నాకు, నా భార్య సరితాకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. మేమిద్దరం హోం క్వారంటైన్ నుంచి కొవిడ్ కేంద్రానికి వెళుతున్నాం’’ అని సరితాదేవి భర్త తోయిబా వెల్లడించారు.
తామిద్దరికీ ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా సోకిందని, గత వారం రోజులుగా తమను కలిసిన వారందరూ వెంటనే హోంక్వారంటైన్ లోకి వెళ్లాలని బాక్సర్ సరితాదేవి కోరారు. జాతీయ బాక్సింగ్ శిక్షణ శిబిరం పాటియాలాలో నడుస్తున్నా, కరోనా వల్ల సరితాదేవి తన స్వస్థలమైన మణిపూర్ లోనే ఉండిపోయారు. మరోవైపు సైక్లిస్ట్ త్రియాషా పాల్ కరోనా బారిన పడ్డారు.
కాగా హాకీ జట్టు కెప్టెన్ మనప్రీత్ సింగ్ తోపాటు ఆరుగురు హాకీ క్రీడాకారులకు కరోనా నెగిటివ్ అని రావడంతో వారు బెంగళూరులోని ఎస్ఎస్ స్పార్ష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని స్పోర్ట్సు అథారిటీ వెల్లడించింది. ఆగస్టు 19 నుంచి హాకి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నా, కరోనా నుంచి కోలుకున్న ఆరుగురు క్రీడాకారులను మాత్రం శిక్షణ శిబిరానికి అనుమతించమని అకాడమీ అధికారులు చెప్పారు.