త్వరలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్‌ అభినవ్ బింద్రాకు అరుదైన అవకాశం లభించింది. ఒలింపిక్ జ్యోతిని ఆయన మోయనున్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా ఘనత వహించిన ఈయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించాడు.

త్వరలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్‌ అభినవ్ బింద్రాకు అరుదైన అవకాశం లభించింది. ఒలింపిక్ జ్యోతిని ఆయన మోయనున్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా ఘనత వహించిన ఈయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించాడు. అభినవ్ ఇలా వ్రాశాడు, 'నేను 2024 పారిస్ ఒలింపిక్ గేమ్స్‌లో టార్చ్ మోస్తాను. ఈ వార్తను పంచుకోవడానికి సంతోషంగా వుంది. ఒలింపిక్ క్రీడల జ్యోతి ప్రపంచవ్యాప్తంగా శాంతి , పట్టుదలకు చిహ్నం. ఈ జ్వాల మనందరిలో కలలు కనే అభిరుచి , సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒలింపిక్ క్రీడల జెండాను మోయగలగడం నాకు దక్కిన ప్రత్యేక గౌరవం ’’ అని ఆయన పేర్కొన్నారు. 

View post on Instagram