Asianet News TeluguAsianet News Telugu

జగన్ వాలంటీర్ల వ్యూహం: వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ, చంద్రబాబు పాఠం!

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే... వైసీపీ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారట. గ్రామవాలంటీర్ల పేరు చెబితేనే వణికిపోతున్నారు. సాధారణంగా ఆ నియోజకవర్గాలకి కింగుల్లా ఉండే ఎమ్మెల్యేలు, తమ సొంత నియోజకవర్గంలోని వాలంటీర్లకు మాత్రం హడలెత్తిపోతున్నారు.

Village Volunteers System: MLA's Fearing The Most,  AP CM YS Jagan's Master sketch Behind
Author
Amaravathi, First Published Jun 9, 2020, 11:32 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ గ్రామవాలంటీర్లు. ఈ వ్యవస్థ ప్రారంభిస్తున్న సమయంలో ప్రతిపక్షాలు వైసీపీ సర్కారుపై అనేక విమర్శలు చేసినప్పటికీ... వారు మాత్రం దీన్ని ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో ఊరిలోకి కొత్తగా ఎవరు వచ్చారు, ఇతరాత్రాల సర్వేలను నిర్వహించడానికి వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయుక్తకరంగా మారింది కూడా.  

అయితే తాజాగా ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే... వైసీపీ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారట. గ్రామవాలంటీర్ల పేరు చెబితేనే వణికిపోతున్నారు. సాధారణంగా ఆ నియోజకవర్గాలకి కింగుల్లా ఉండే ఎమ్మెల్యేలు, తమ సొంత నియోజకవర్గంలోని వాలంటీర్లకు మాత్రం హడలెత్తిపోతున్నారు.

గ్రామా వాలంటీర్ల సమాచార సేకరణ అంటే మాత్రం ఎమ్మెల్యేలకు చమటలు పడుతున్నాయి. వారు సర్వేలు, సమాచార సేకరణ పేరుతో పనిలోపనిగా ఎమ్మెల్యేల గురించిన సమాచారం సేకరిస్తున్నారట. ఆ సేకరించిన సమాచారం వెంటనే అధిష్టానానికి చేరవేస్తున్నారట. ఇది ఇప్పుడు అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న భయాందోళనలు. 

గ్రామసచివాలయ సిబ్బందులతో ఎమ్మెల్యేలు తప్పనిసరి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనుల సమీకహలో భాగంగా అనిపించినప్పటికీ... పనిలోపనిగా ఏమైనా విచారణలు వాలంటీర్లు జరిపారా, తమ గిరించిన వివరాలను ఏమైనా సేకరించారా అని ఆరా తీస్తున్నారు. 

రాజకీయపరమైన అంశాల నుంచి మొదలు, ఇసుక, మద్యం సహా అనేక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని వారు అధిష్టానానికి ఉప్పందిస్తున్నారు. అది కూడా క్షణాల్లో జరిగిపోతుండడం వారిని కలవరపెడుతున్న అంశం. 

ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని, సర్వేలను, ఇతర డేటాను వలంటీర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. చివరకు ఆయా పోలీస్ స్టేషన్లలో ఉండే కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులు కూడా వలంటీర్ల ద్వారా గ్రామాలలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అనధికారిక వేగులుగా పనిచేస్తున్నారు గ్రామ వాలంటీర్లు. 

ఈ క్రమంలో తమ అనధికారిక కార్యకలాపాల గురించి తమ దందాలా గురించి ఎక్కడ తెలిసిపోటీహిన్దో అని భయపడిపోతున్నారు నాయకులు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఇతర సీనియర్ నాయకుల గురించిన సమాచారం కూడా వీరు తెలుసుకుంటున్నారట. తెలుసుకుంటున్నారట. 

గ్రామంలోని ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ ను నియమిస్తామని పేర్కొన్న ప్రభుత్వం, చెప్పినట్టుగానే ఆ మేరకు వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి మరీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సూచించిన వారినే ఎంపిక చేశారు. 

వారిలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, వీరాభిమానులు ఎక్కువ. గ్రామ, వార్డు వలంటీర్లుగా ఎంపికైన వారు.. క్షేత్రస్థాయిలో జరిగే పేదలకు రేషన్, పెన్షన్ పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకుచేరవేయడంలో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ... అక్కడి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. ఊర్లల్లో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అందరితో కలిసిపోయి ఉండడం వల్ల గ్రామంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. అసాంఘిక కార్యకలాపాల నుంచి మొదలు అనైతిక కార్యక్రమాల వరకు పోలీసులు వారి వద్ద నుండి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. 

మద్యం, ఇసుక అక్రమ రవాణా సమాచారాన్ని కూడా నిఘా వర్గాలు వలంటీర్ల ద్వారా రహస్యంగా సేకరిస్తున్నాయట. తాజాగా ఇసుక అక్రమ రవాణా, పలు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఆయా గ్రామాల్లోని చోటా నేతల వ్యవహార శైలి, ఇతర ప్రజాప్రతినిధుల పనితీరుని సంబంధిత శాఖల జిల్లా అధికారులు వలంటీర్ల ద్వారానే తెలుసుకుంటున్నారట. 

రాష్ట్రంలో కాల్ సెంటర్లకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా గ్రామవాలంటీర్లకు ఫోన్ చేసి సమాచారాన్ని రాబడుతున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గానికి చెందినవారికి కూడా కొన్ని చోట్ల గ్రామా వాలంటీర్లుగా నియమించి వారికి నేరుగా ఫోన్లు చేసి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

అయితే ఇక్కడొక ఆసక్తికర అంశం ఏమిటంటే... ఫైరవీలు జరిపిమరీ తమవారికి వలంటీర్లుగా నిమించుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే. మాత్రం ఎమ్మెల్యేలే వారిని ఎందుకు రికమెండ్  అనుకుంటున్నారు. 

పార్లల్ గవర్నమెంట్ గా(సమాంతర ప్రభుత్వంగా) వలంటీర్ల వ్యవస్థ పని చేస్తోందని కూడా కొందరు ఎమ్మెల్యేలు తలలుపట్టుకుంటున్న పరిస్థితి. ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ప్రజాప్రతినిధులపై వలంటీర్ల ద్వారా నిఘా పెట్టి ఉంచారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఒక గ్రామంలో వెయ్యి కుటుంబాలు ఉంటే.. 20 మంది వలంటీర్లు ఉంటారు. వీళ్లల్లో నలుగురైదుగురితో టచ్ లో ఉన్నా.. అక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలిసిపోతుంది. 

వైసీపీ సర్కారు ఇలా ఎమ్మెల్యేలపై నిఘా పెట్టడానికి కారణం లేకపోలేదు అంటున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో స్థానిక ఎమ్మెల్యేలు తమ అక్రమ దందాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వారి భూ. ఇసుకేల దందాలు టీడీపీ ఓటమికి ప్రధాన కారణం. 

ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కారు ఇలా రిపోర్టులను తెప్పించుకుంటున్నట్టు చెబుతున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలు కూడా తోక జాడియ్యకుండా జాగ్రత్తపడేందుకు ఉపయుక్తకరంగా ఉంటుందని అంటున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను గనుక బలపరిస్తే... గ్రామా స్థాయిలో వైసీపీ ప్రజాదరణ కూడా మెరుగుపడుతుందని అవసరమనుకుంటే... మరో నాయకుడినయినా ప్రొజెక్ట్ చేసేవీలుంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios