ఒక్కో పోస్టుకు 1512 మంది పోటీ, 40 లక్షల మంది ఇలా...
ఇంటర్ అర్హతతో కూడిన వీఆర్వో పోస్టులకు పీహెచ్‌డీ హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పీహెచ్‌డీ చదివినవారుదాదాపు 400 మంది, ఎంఫిల్ చేసినవారు దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు.
టీ.ఎస్.పి ఎస్.సి పీఎస్సీ 700 వీఆర్వో పోస్టుల కోసం ప్రకటన చేశారు. అభ్యర్థులు 10.59 (అక్షారాల 10లక్షల58వేల387) మంది అప్లై చేశారు. ఇదీ రాష్ట్రంలో ఉద్యోగ-నిరుద్యోగ రంగ పరిస్థితి. గతంలో వలెనె భారీస్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సుమారు 1512మంది పోటీలో ఉన్నారు. ఇంటర్ అర్హతతో కూడిన ఈ పోస్టులకు పీహెచ్‌డీ పూర్తి చేసినవారు, ఇoజనీరింగ్, లా,ఎం.ఎస్.సి చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
ఇంటర్ అర్హతతో కూడిన వీఆర్వో పోస్టులకు పీహెచ్‌డీ హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పీహెచ్‌డీ చదివినవారుదాదాపు 400 మంది, ఎంఫిల్ చేసినవారు దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక, పీజీ చేసినవారు దాదాపు లక్షా యాబైరెండువేల (1,51,735) మంది, అండర్ గ్రాడ్యుయేట్స్ దాదాపు నాలుగున్నర లక్షల మంది (4,49,439) మంది, ఇంటర్ చదివినవారు4,17,870 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఒక్కో అభ్యర్తి 300 రూపాయలు ఫీజు కట్టగా ఆ మొత్తం 32 కోట్ల రూపాయలు అవుతాయి.ఇది చిన్న మొత్తమే కాని పుస్తకాలు ,కోచింగుల కోసం ఒక్కో అభ్యర్థి సరాసరిన పది వేల రూపాయలను ఖర్చు చేస్తారు. ఒక్కో అభ్యర్థి పరీక్షల కోసం ఆరు నెలల పాటు సరాసరిన రోజుకు 12 నుండి 16 గంటలు వినియోగిస్తాడు. 2160-2880 గంటలు వినియోగిస్తాడు. మొత్తం అభ్యర్థుల్లో సగం మంది సీరియస్ గా చదువుతారు అనుకుంటే 5.30 లక్షల మంది x 2160-2880 గంటలు ...ఈ పని గంటల విలువ కొన్నివందల-వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇది ఉట్టి అనుత్పాదక ఖర్చు ,ఇది తెలంగాణా సమాజానికి రాష్ట్రానికి ఎంతో నష్ట దాయకం,అరిష్ట దాయకం కుడా. ఇలా పనిచెయ గలిగిన చేతులు, ఆలోచించగలిగిన మెదళ్ళు ఖాళీగా ఉండడం అటు ప్రభుత్వానికి ఇటు సమాజానికి ఎంతో నష్టం.ఈ నష్టం దాని ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుంది. ఈ ఎరుక ఉన్న వారు ఏలికల్లో చాలా తక్కువ మంది ఉండడం విచారకరం.
వీఆర్వోల రాత పరీక్ష సెప్టెంబర్16న జరుగనుంది. నోటిఫికేషన్‌ను పాత జిల్లాల ప్రకారం జారీ చేసినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 2,945 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే2,87,962 మందికి 627 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు3.70 లక్షల మంది హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్షా కేంద్రం కావాలని ఆప్షన్లు ఇచ్చినప్పటీకీ, ఈ పరిధిలో ఎంత మందికి పరీక్ష నిర్వహించగలమో అంతవరకు ఏర్పాట్లు చేసి, తప్పని పరిస్థితుల్లో ఇతర పరీక్షా కేంద్రాల్లో సర్దుబాటు చేశారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నందున గతంలో ఎప్పుడు పరీక్షా కేంద్రాలకు ఉపయోగించని స్కూళ్లు, కాలేజీలను కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
గతంలో గ్రూప్-2 సందర్భంగా కొంత గందరగోళం నెలకొంది, ఈ సారి అలా జరగకుండా ఇన్విజిలేటర్లకు కూడా శిక్షణ ఇచ్చారట. ఇచ్చేందుకు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు కొత్తగా జోనల్ అధికారులను నియమించారు. గతంలో సంభవించిన వైపల్యాల దృష్ట్యా , అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈసారి బయోమెట్రిక్ యంత్రాలను వాడటం లేదట.
టీ.ఎస్.పి ఎస్.సి ఇప్పటివరకు 29,633 ఉద్యోగాలకు 75 ఉద్యోగ ప్రకటనల ద్వార దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిల్లో 5932 ఉద్యోగాలను మాత్రమె నింప గలిగింది. 23,906 ఉద్యోగాలకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయట. 8,657ఉద్యోగాలకు సంబందించి సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ అయిందని చైర్మెన్ అధికారిక లేఖలో వెల్లడించారు. 4118 ఖాళీలకు సంబంధించి ప్రకటన వెలువడనుంది. కమీషన్ ఏర్పడి మూడు ఏళ్ళు అయిన సందర్బంగా నూరవ నోటిఫికేషన్ను వేలువరించనున్నారు.దీంతో టీ.ఎస్.పి ఎస్.సి 30 వేల పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువరించినట్లు అవుతుంది.
టీ.ఎస్.పి ఎస్.సిఇచ్చిన అనేక ప్రకటనలు, నిర్వహించిన పరీక్షలు, జరిపిన పలు ఇంటర్వ్యులను కోర్టు తప్పు పట్టింది. దాదాపు రెండేళ్ళ క్రితం నిర్వహింఛిన గ్రూప్ 2 పలితాలు కోర్టులో ఇంకా తేల లేదు. 2016 నవంబర్లో నిర్వహించిన గ్రూప్ 2 –ఏ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై కొందరు కోర్టుకు వెళ్ళారు. సమాధాన పత్రంలో వైట్నర్ వాడిన వారిని అనర్హులుగా ప్రకటిoచాలన్న కొందరి విజ్ఞప్తిని కోర్టు మన్నిచి 2017, వైట్నర్ వాడిన సమాధాన పత్రాలను తీసివేయాలని తీర్పు చెప్పింది. దీనిపై టీ.ఎస్.పి ఎస్.సి మళ్ళీ కోర్టుకెళ్లింది. వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్ లో ఉంది. ప్రభుత్వం, టీ.ఎస్.పి ఎస్.సి ప్రతిష్టతో ముడి పడి ఉన్న కేసు కాబట్టి కోర్టు పై ఒత్తిడి ఉందని,తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావచ్చని కథనాలు వెలువడ్డాయి.
టీ.ఎస్.పి ఎస్.సి ప్రవేశ పెట్టిన ఒన్ టైం రిజిస్ట్రేషన్ పద్దతి అనూహ్య పలితాలను ఇచ్చింది, దీని ద్వారా దాదాపు 19 లక్షల మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 2017 నాటికి 18.64 లక్షల మంది ఓ.టి.ఆర్ లో పేర్లను నమోదు చేసుకున్నారు. తమ పేర్లను నమోదు చేసుకోని వారు దాదాపు ఇంతే మంది బయట ఉన్నారు. ఇంత మంది నిరాశకు ,ఆశాంతికి గురయితే రాష్ట్రంలో ఊహించని సమస్యలు పొడ సూప వచ్చు.
వీరందరికీ ప్రభుత్వం నెలకు ఇదు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నిరుద్యోగ సమస్య పై సామాజిక శాస్త్రవేత్తలతో అద్యయనం చేయించాలి. వీరందరికీ ఎప్పటికి ఉద్యోగాలు ఇస్తారో తెలియదు.ఈ 19 లక్షలకు తోడు తెలంగాణలో మొత్తం మూడు తరాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఎలాగూ ఉద్యోగం ఇవ్వలేదు, ప్రకటించిన ఉద్యోగాలకు అయినా పరీక్షలను సత్వరం నిర్వహించి అవసరం అయితే మూడు నాలుగు నెలల కాల పరిమితి విదించి ఉద్యోగాలను ఇవ్వాలి.
- దుర్గం రవిందర్
9346454912