అమరావతి: చూడగానే ఎక్కడో మధ్యప్రాచ్యంలో ఉన్న ఇరాన్ కి, అవతల అల్లంత దూరాన ఉన్న అమెరికాకు మధ్య యుద్ధం అని వినబడుతుంటే...ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం ఏమిటి అని ఆశ్చర్యపడకండి. ట్రంప్ ప్రస్తుతం ఇరాన్ తో కయ్యానికి కాలుదువ్వడానికి, అసలు ఈ ఉద్రిక్త పరిస్థితులకు ఆద్యం పడింది 2018లో ట్రంప్ తీసుకున్న ఒక అనాలోచిత రాజకీయ ప్రతీకార చర్య.  

వివరాల్లోకి వెళితే అమెరికాకు ఇరాన్ కు మధ్య ఎప్పటి నుండో వైరం ఉంది. దశాబ్దాల ఈ వైరాన్ని చెరిపివేసి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇరాన్ తో అను ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ తరువాత మధ్యప్రాచ్యం ప్రాంతంలో పరిస్థితులు చాలా వరకు చక్కబడ్డాయి. 

సౌదీ అరేబియా, ఇస్రేల్ లు ఒకింత గుర్రుగా ఉన్నప్పటికీ కూడా అమెరికా ఆ కాలంలో వారిద్దరిని బాగానే మేనేజ్ చేసింది. ఒబామా తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఒబామా చూపిన చొరవను అప్పట్లో ప్రపంచ దేశాలు ఎంతో మెచ్చుకున్నాయి. ఆతరువాత అమెరికా అధ్యక్షా ఎన్నికలు జరగడం... ఆ తరువాత అక్కడ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదంతా జరిగిపోయింది. 

also read వైఎస్ వివేకా హత్య: బాబుకు హైకోర్టు నోటీసులు

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక 2018లో రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ తో అప్పటి అధ్యక్షుడు ఒబామా కుదుర్చుకున్న అను ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇక ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. అప్పట్లో ఇరాన్ అణ్వాయుధాలను తయారుచేస్తుందనే నెపంతో వారిపైన తీవ్రస్థాయి ఆంక్షలను విధించింది అమెరికా. 

కానీ ఆ తరువాత ఒబామా చొరవ చూపి వారు వారి వద్ద ఉన్న యురేనియం ను అణ్వాయుధాల తయారీకి కాకుండా... కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే వాడాలని ఒక నిబంధన పెట్టి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో అమెరికా సక్సెస్ అయ్యింది. 

ఇక ఒబామా కుదిర్చిన ఈ ఒప్పందాన్ని ఎలాగైనా సరే తీసేయాల్సిందే... ఒబామా పేరు లేకుండా చెరిపేయాల్సిందే అని కృతనిశ్చయంతో ఉన్న ట్రంప్ 2018 మే 8వ తేదీన ఆ ఒప్పందాన్ని రద్దు చేసాడు. ఆ తరువాత ఇరాన్ పై తీవ్రమైన ఆంక్షలు విధించాడు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఒక రకంగా ఏకంగా మధ్యప్రాచ్యమంతా కూడా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. 

ఇలా ఒక అనాలోచిత అర్థరహిత సహేతుకం కాని ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంటే...మరో పక్కనేమో సోషల్ మీడియాలో ఏకంగా మూడవ ప్రపంచ యుద్ధం అని ట్రెండ్ అవుతుంటే... నలిగిపోతుంది మాత్రం సాధారణ ప్రజలు. 

అవె పరిస్థితులు మనకు ఏ దేశంలో అయినా కనబడుతాయి. భారతదేశం దానికి ఏమి అతీతం కాదు. మనదేశంలో గనుక ఒక మంచి ఉదాహరణగా చెప్పాలంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను చూస్తే మనకు అర్థమయిపోతుంది. రాజధాని వికేంద్రీకరణ పేరుతో అక్కడ జరుగుతున్న రాజకీయం దీన్నే సూచిస్తుంది. 

అమరావతి ఎందుకు వద్దో పూటకో కారణం చెబుతూ...అక్కడి నుండి విశాఖపట్నానికి పూర్తిస్థాయిలో తరలించేందుకు రంగం సిద్ధమయ్యింది. అమరావతిలో అవకతవకలు;యూ జరిగాయి అని అనుకుందాం. అప్పుడు అక్కడ శిక్షించాల్సింది ఆ అవకతవకలకు కారణమైన చంద్రబాబు నాయుడును, టీడీపీ పార్టీ నేతలను కానీ ప్రజలను కాదు కదా!

పోనీ ఇప్పుడు ఈ రాజధాని మార్పు వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనం ఎమన్నా ఉందా అంటే... అది కూడా ఏమి కనబడడం లేదు. పరిపాలన వికేంద్రీకరణ పెరిత ఆర్ధిక వనరుల కేంద్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెంది, పరిశ్రమలు వెలసి ఉన్న విశాఖపట్నం ఆర్థికంగా సంపన్నమైన ప్రాంతం. అందుకే అక్కడ ప్రాంత ప్రజలు ఏ నాడు కూడా అక్కడ రాజధాని పెట్టమని డిమాండ్ చేయలేదు. ఆర్థికంగా వెనకబడ్డ ప్రాంతం కాబట్టే రాయలసీమ ప్రాంత వాసులు రాజధాని కోసం డిమాండ్ చేస్తున్నారు. 

ఆర్ధిక రాజధానినే రాజధాని చేయాలి అనే గనుక అనుకుంటే ఈ పతికి భారతదేశ రాజధాని ఢిల్లీ నుండి ఈ పాటికే ముంబైకి మార్చి ఉండాల్సింది. కానీ ఏనాడూ మహారాష్ట్రప్రజలు డిమాండ్ చేయలేదే! ఇప్పుడున్న అమరావతిలో పైనున్న ఇంద్రుడి అమరావతిని తలదన్నే రాజధానిని నిర్మించలేకున్నప్పటికీ.... ఒక సాధారణ పరిపాలనా సౌలభ్యమైన రాజధానిని నిర్మించవచ్చు. దానివల్ల ఇప్పుడు పెట్టబోయే ఖర్చులో చాలావరకు తగ్గుతుంది కూడా. 

ప్రభుత్వం చేస్తున్న మరో వాదన ఏమిటంటే..వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరుగుతుంది అనే ఒక వాదనను తెరపైకి తీసుకొస్తుంది. నిజమే వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి జరుగుతుంది. కావలిసింది అధికార వికేంద్రేకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది పాలనా ప్రదేశాల వికేంద్రీకరణ. దాని వల్ల ఎవరికీ లాభం ఒనగూరుతుందో..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికే తెలియాలి. 

also read అక్రమాస్తుల కేసు: తప్పనిసరి పరిస్థితుల్లో, ఎల్లుండి సీబీఐ కోర్టుకి జగన్

జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయన పాలన తరహాను గనుక గమనిస్తే... చంద్రబాబు పేరు అనేది చరిత్రలో లేకుండా చేసేయాలని ఆలోచనే ప్రధానంగా కనబడుతుంది. పోలవరం నుండి మొదలుకొని అమరావతి వరకు ఇదే విషయం స్పష్టంగా కనబడుతుంది. చంద్రబాబు పేరు చెరిపేయాలని చూస్తున్నారు జగన్. ఏ రాజకీయ నాయకుడైనా తన ఇమేజ్ పెంచుకోవడం కోసం చేసే పని అది. 

ఇక్కడే జగన్ తండ్రైన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు ఇప్పటికి చెప్పుకుంటాడు...హైటెక్ సిటీ కట్టింది తానే అని, సైబరాబాద్ ను నిర్మించింది కూడా థానే అని చెబుతుంటాడు. ఏవ్ కాకుండా ఎయిర్ పోర్ట్, పీవీ నరసింహ రావు ఎక్ష్ప్రెస్స్ వే కూడా థన్ ఖాతాలో వేసుకునే ప్రయత్నమే చేస్తాడు. చంద్రబాబు ఖాతాలో కేవలం హైటెక్ సిటీని మాత్రమే ప్రజలు గుర్తిస్తారు తప్ప, మిగిలిన వాటిని గుర్తించరు. ఎయిర్ పోర్ట్ అన్నా, పీవీ ఎక్స్ప్రెస్ వే అన్న మనకు గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి. 

ఆయన వాటి పీర్లు మర్చి పూర్తిగా అక్కడ చంద్రబాబు పేరనేది కనబడకుండా, వినబడకుండా చేయగలిగాడు. ఒకవేళ ఇప్పుడు గనుక రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే... ఖచ్చితంగా అమరావతిని తరలించేవారు కాదు. దాన్ని నిర్మించి పేర్లను ఎక్కడికక్కడకు మార్చి చంద్రబాబు అనే ఒక మనిషిని తెరమరుగు చేసి...ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకునేవాడు. 

అక్కడ ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల అయినా, ఇక్కడ జగన్ తీసుకున్న ఈ చర్య వల్ల అయినా నష్టపోతుంది, ఇబ్బందులు పడుతుంది సామాన్య సగటు ప్రజలు.