Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సెంటిమెంట్ కు మళ్లీ ప్రాణం: రేవంత్ రెడ్డి ట్రాప్ లో టీఆర్ఎస్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ నియామకానికి జోడించి వ్యాఖ్యలు చేయడం ద్వారా టీఆర్ఎస్ తిరిగి తెలంగాణ సెంటిమెంట్ కు ప్రాణం పోయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

Telangana sentiment revoked: TRS in the trap of Revanth Reddy
Author
Hyderabad, First Published Jul 10, 2021, 8:05 AM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ కు తిరిగి ప్రాణం పోసే దిశగా టీఆర్ఎస్ నడుస్తోంది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన వెంటనే దాన్ని టీడీపీ పీసీసీగా స్వయంగా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యను టీఆర్ఎస్ నేతలు అస్త్రంగా వాడుకున్నట్లు కనిపిస్తున్నారు. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు అధిష్టానాన్ని ప్రభావితం చేసి రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి ఇప్పించుకున్నారని హరీష్ రావుతో సహా ఇతర నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇప్పింటుకోవడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించడానికి చంద్రబాబు వ్యూహరచన చేశారని అంటున్నారు. తద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. 

చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఏ స్థితిలోనూ ఆహ్వానించబోరని, రేవంత్ రెడ్డి నియామకాన్ని చంద్రబాబుకు అంటగట్టడం ద్వారా ఫలితం సాధించాలని టీఆర్ఎస్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. తద్వారా రేవంత్ రెడ్డికి మద్దతు లభించకుండా చూడాలనేది టీఆర్ఎస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే, టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడినట్లు కనిపిస్తున్నారు. 

పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి తన దూకుడు టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరంగానే మారినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా ముందుకు వెళ్లడానికి రేవంత్ రెడ్డి అవకాశం కల్పించినట్లయింది. విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగి అది రేవంత్ రెడ్డి ప్రతి రోజూ చర్చనీయంగా మారే పరిస్థితి ఏర్పడింది. 

టీడీపీ నుంచి తాను వచ్చి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టడం మీద టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి అదే అస్త్రంతో సమాధానం ఇస్తున్నారు. తాను టీడీపీ నుంచి వస్తే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చినవారే అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా టీడీపీ వాళ్లే కదా, టీడీపీ వాళ్లే మంత్రులుగా ఉన్నారు కదా అని ఆయన అంటున్నారు. 

టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు ధీటైన సమాధానాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించినట్లయింది. తద్వారా రేవంత్ రెడ్డి ట్రాప్ లో టీఆర్ఎస్ నేతలు పడినట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా టీఆర్ఎస్ ఆయన గుర్తించినట్లయింది. తద్వారా ఆయన తెలంగాణ రాజకీయాల్లో నిత్యం క్రియాశీలకంగా ఉండడానికి అవకాశం కలిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios